breaking news
high-speed train
-
హై స్పీడ్ ట్రైన్‌ను పట్టుకొని వేలాడుతూ..
59 ఏళ్ల వ్యక్తి హై స్పీడ్ జర్మన్ ట్రైన్‌ను పట్టుకొని వేలాడుతూ దాదాపు 25 కిలో మీటర్లు ప్రయాణించారు. జర్మనీలో పర్యటిస్తున్న ఓ రొమానియన్ తన లగేజీని ట్రైన్లోనే మరిచి పోయి బిలేఫీల్డ్ స్టేషన్ ఫ్లాట్‌ఫాంపై దిగిపోయారు. అంతలోనే ట్రైన్ స్టార్ట్ అవ్వడంతో డోర్లు మూసుకుపోయాయి. ఎలాగైనా తన లగేజీని తీసుకోవాలనే తొందరలో హై స్పీడ్ ట్రైన్‌ని పట్టుకున్నారు. రెండు బోగీలను కలిపే భాగంలో ట్రైన్‌ని పట్టుకొని సదరు వ్యక్తి దాదాపు 25 కిలో మీటర్లు ప్రయాణించారు. ట్రైన్ స్టాఫ్ బయటవైపు ఉన్న రొమానియన్ను గమనించి డ్రైవర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. దీంతో స్టాప్లేకపోయినా తదుపరి స్టేషన్లో డ్రైవర్ ట్రైన్‌ని ఆపారు. ఆ వ్యక్తి తిరిగి అదే ట్రైన్లో తన లగేజీని తీసుకొని హనోవర్ వరకు వెళ్లారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని జర్మనీ అధికారులు తెలిపారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ట్రైన్‌ను ఎలా పట్టుకుని వేలాడో... మిషన్ ఇంపాజిబుల్ సినిమా చాలా సార్లు చూశాడేమో అంటూ నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, అతన్ని విచారించనున్నారని అధికారులు తెలిపారు. -
హైస్పీడ్ రైలు కింద చిక్కుకుపోయిన చిన్నారి
ప్రమాదవశాత్తు ఓ రెండేళ్ల బాలుడు పట్టాల మీద ఆగిన హైస్పీడ్ రైలు, ప్లాట్‌ఫామ్ మధ్యనున్న చిన్న సందులో పడిపోయాడు. దాదాపు నాలుగు గంటలపాటు సందులోనే బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఈ ఘటన ఈశాన్య చైనాలోని చాంగ్‌చున్‌లో ఈ నెల 2న జరిగింది. హార్బిన్ నుంచి దాలియన్ వెళ్తున్న హైస్పీడ్ రైలు మరమ్మత్తుల కోసం చాంగ్‌చున్ స్టేషన్ వద్ద ఆగగా.. తల్లిదండ్రులతోపాటు కిందకు దిగిన బాలుడు రైలు ఎక్కే సమయంలో ప్లాట్‌ఫామ్ మధ్యలో ఉన్న చిన్న సందులో పడిపోయాడు. ఆ ఇరుకైన సందు ఎనిమిది అంచుల వెడల్పు మాత్రమే ఉండటంతో పెద్దవాళ్లు అందులోకి దిగి బాలుడ్ని తీయడం సాధ్యపడలేదు. దీంతో సహాయక బృందాలు శ్రమించి నాలుగు గంటల అనంతరం బాలుడ్ని కాపాడాయి. నాలుగు గంటల అనంతరం చిన్నారి సురక్షితంగా తల్లిదండ్రుల ఒడికి చేరాడు.