కేంద్ర మాజీ మంత్రి సెల్జా నివాసంలో మృతదేహం | Body found at Kumari Selja's house in Delhi | Sakshi
Sakshi News home page

కేంద్ర మాజీ మంత్రి సెల్జా నివాసంలో మృతదేహం

Aug 11 2014 6:03 PM | Updated on Apr 3 2019 5:34 PM

కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు కుమారి సెల్జా నివాసంలో సోమవారం ఉదయుం ఒక వ్యక్తి మృత దేహం కనిపించడం కలకలం సష్టించింది.

 న్యూఢిల్లీ: కేంద్ర  మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు కుమారి సెల్జా నివాసంలో  సోమవారం ఉదయుం  ఒక వ్యక్తి మృత దేహం కనిపించడం కలకలం సష్టించింది. మరణించిన వ్యక్తి పేరు సంజయ్(42) అని, అతను మధ్య ఢిల్లీలోని సునెహ్రీబాగ్లోని సెల్జా నివాసంలో పనిచేసే మహిళ  భర్త అని పోలీసులు తెలిపారు. సంజయ్ మతదేహాన్ని ఉదయుం 8 గంటలకు సెక్యూరిటీ గార్డు చూశాడు.

పోలీసులకు  వెంటనే సమాచారం అందించడంతో ఉన్నతాధికారులతో పాటు తిలక్‌మార్గ్ పోలీస్‌స్టేషన్ అధికారులు, ఫోరెన్సిక్ సిబ్బంది, నేర విభాగం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంజయ్ మరణం సహజమైనది కాదని పోలీసులు అనుమానిస్తున్నారు. సంజయ్ శరీరంపై గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement