'వెన్నుపోటు పొడవలేదు, పొత్తు వదులుకున్నాం' | BJP will form government in Maharashtra, Haryana: Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

'వెన్నుపోటు పొడవలేదు, పొత్తు వదులుకున్నాం'

Oct 10 2014 4:26 PM | Updated on Oct 8 2018 5:45 PM

'వెన్నుపోటు పొడవలేదు, పొత్తు వదులుకున్నాం' - Sakshi

'వెన్నుపోటు పొడవలేదు, పొత్తు వదులుకున్నాం'

మహారాష్ట్ర, హర్యానా రాష్టాల్లో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్టాల్లో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ సీనియర్ నేత,  కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో తమ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే అని చెప్పారు. అయితే శివసేనకు వ్యతిరేకంగా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

శివసేనను తాము వెన్నుపోటు పొడవలేదని,  ఆ పార్టీతో పొత్తు మాత్రమే వదులుకున్నామని చెప్పారు. హర్యానాలో కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాలని ఓటర్లు నిర్ణయించుకున్నారని అన్నారు. ఎన్నికల తర్వాత హర్యానాలో ప్రభుత్వ పగ్గాలు తమ చేతికే వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, హర్యానాలో ఈనెల 15న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement