
ఢిల్లీ రాజ్ అరెస్ట్, పతనమైన షేర్లు
ఎస్ కె ఎస్ మైక్రో ఫైనాన్స్ వివాదంలో ఫ్యామస్ అయిన ఎస్ ఢిల్లీ రాజ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ఆయన అధ్యక్షుడుగా ఉన్న భారత్ ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ షేర్లు భారీగా పతనమయ్యాయి
భారత్ ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ అధ్యక్షుడు ఎస్ ఢిల్లీ రాజ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో భారత్ ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాదాపు 11శాతం పడిపోయింది. సంస్థ అధ్యక్షుడు రాజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. గతంలో పనిచేసిన ఫస్ట్ లీజింగ్‌కు సంబంధించిన ఒక కేసులో ఈడీ ఫస్ట్ లీజింగ్ సంస్థ మాజీ సీఎప్ వో లు ఢిల్లీ రాజ్, శివరామ కృస్ణన్ లను సోమవారం అదుపులోకి తీసుకుంది. రూ. 500 కోట్లపై జరిగిన కుంభకోణం కేసులో అరెస్ట్ చేసిన వీరిద్దరిని కోర్టుకు హాజరు పర్చి అనంతరం ఈ నెల11 వరకు రిమాండ్ చేసింది. దీంతో భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. మంగళవారం నాటి మార్కెట్ ముగింపులో 9.67 శాతం క్షీణించిన షేరు ధర రూ.822.65 దగ్గర ముగిసింది.
అయితే ఫస్ట్ లీజింగ్ కేసు విచారణ నేపథ్యంలో అతణ్ని అరెస్ట్ చేసిందని, ఆ విచారణకు తమ కంపెనీకి సంబంధం లేదని భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ పేర్కొంది. 2008లో ఎస్‌కేఎస్ మైక్రోఫైనాన్స్‌గా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సమయంలో ఢిల్లీరాజ్ ప్రెసిడెంట్‌గా కంపెనీలో బాధ్యతలు చేపట్టినట్లు తెలిపింది. అయితే ఫస్ట్‌లీజింగ్ ఉద్యోగిగా తీసుకున్న రుణాలను ఢిల్లీరాజ్ తిరిగి చెల్లించివేసినట్లు వివరణ ఇచ్చింది. ఆయన కంపెనీని వీడిని ఆరు సంవత్సరాల తర్వాత 2012 , 2013 సంవత్సరంలో రుణాలు మంజూరుకు సంబంధించి ఐడీబీఐ బ్యాంక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, దర్యాప్తులో భాగంగా ఈడీ ఢిల్లీరాజ్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. ట్రెజరీ కార్యకలాపాలవరకే తన పాత్ర పరిమితం అయి ఉండేదనీ, ఢిల్లీ రాజ్ వివరణ ఇచ్చారు. ఫస్ట్ లీజింగ్ కు సంబంధించి ఇతర ఆర్థిక నివేదికపై సైన్ చేసే అధికారం తనకు లేదన్నారు.
మరోపక్క భారత్ ఫైనాన్షియల్ షేరు రేటింగ్‌ను అంతర్జాతీయ బ్రోకరేజ్ క్రెడిట్ స్యూజ్ డౌన్‌గ్రేడ్ చేసింది. రేటింగ్‌ను 'తటస్థ' (న్యూట్రల్) నుంచి అండర్ పెర్ఫార్మ్‌కు మార్చింది. సోమవారంనాటి ధర(రూ. 910) ప్రకారం ఈ షేరు వ్యయభరితంగా ఉన్నట్లు అభిప్రాయపడింది.