మీరట్ ఆశ్రమంలో పనివాళ్లూ రేపిస్టులే.. కేసు నమోదు!! | Ashram workers booked for rape bid | Sakshi
Sakshi News home page

మీరట్ ఆశ్రమంలో పనివాళ్లూ రేపిస్టులే.. కేసు నమోదు!!

Nov 16 2013 9:45 AM | Updated on Sep 2 2017 12:40 AM

ఈ రోజుల్లో ఏ ఆశ్రయాన్ని చూసినా రేపిస్టులే కనిపిస్తున్నారు. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు, ఆయన సుపుత్రుడే కాదు.. మరికొందరు రేపిస్టులు కూడా బయటపడుతున్నారు.

ఈ రోజుల్లో ఏ ఆశ్రయాన్ని చూసినా రేపిస్టులే కనిపిస్తున్నారు. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు, ఆయన సుపుత్రుడే కాదు.. మరికొందరు రేపిస్టులు కూడా బయటపడుతున్నారు. మీరట్లో ఉన్న ఓ ఆశ్రమంలో తొమ్మిది మంది పనివాళ్లు ఓ కాలేజి విద్యార్థినిపై అత్యాచారానికి ప్రయత్నించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.  విద్యార్థిని ఫిర్యాదు మేరకు ఆశ్రమ ఇన్చార్జి సహా మొత్తం తొమ్మిదిమందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నవంబర్ మూడో తేదీన ఆ యువతి ఆరోగ్యం బాగోలేకపోయినా.. స్వామి చంద్రమోహన్ దర్శనం కోసం ఆమె పరమాధమ్ ఆశ్రమానికి వెళ్లింది. స్వామికి నాలుగు రోజుల పాటు సేవలు చేసుకోవాలని చెప్పిన ముగ్గురు మహిళలు.. ఆమెను ఓ గదిలో బంధించారు. అనంతరం నలుగురు పురుషులు వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె అభ్యంతరం చెప్పగా, అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆమె అరుపులు విన్న ఇతర భక్తులు అక్కడికొచ్చి ఆమెను కాపాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement