ఎంత డబ్బిచ్చినా తినేస్తారు.. పనిచేయరు! | arvind kejriwal slams mcd over cleanliness | Sakshi
Sakshi News home page

ఎంత డబ్బిచ్చినా తినేస్తారు.. పనిచేయరు!

Sep 18 2015 2:54 PM | Updated on Sep 3 2017 9:35 AM

ఎంత డబ్బిచ్చినా తినేస్తారు.. పనిచేయరు!

ఎంత డబ్బిచ్చినా తినేస్తారు.. పనిచేయరు!

కార్పొరేషన్కు ప్రభుత్వం నుంచి ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే మొత్తం తినేస్తున్నారని, అస్సలు పని అన్నదే చేయట్లేదని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.

దేశ రాజధానిలో డెంగ్యూ విజృంభిస్తుండటంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రంగంలోకి దిగారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ పనితీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్పొరేషన్కు ప్రభుత్వం నుంచి ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే మొత్తం తినేస్తున్నారని, అస్సలు పని అన్నదే చేయట్లేదని విమర్శించారు.

ఎప్పుడూ డబ్బు.. డబ్బు.. అంటారే తప్ప పనిగురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదని అన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని పలు ప్రాంతాలలో పర్యటించడంతో పాటు ఆస్పత్రులను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement