'ఆప్'లో చేరాలంటే ఎస్ఎంఎస్ చేయండి: కేజ్రీవాల్ | Arvind Kejriwal AAP's nation-wide membership drive launched | Sakshi
Sakshi News home page

'ఆప్'లో చేరాలంటే ఎస్ఎంఎస్ చేయండి: కేజ్రీవాల్

Jan 10 2014 2:13 PM | Updated on Apr 4 2018 7:42 PM

'ఆప్'లో చేరాలంటే ఎస్ఎంఎస్ చేయండి: కేజ్రీవాల్ - Sakshi

'ఆప్'లో చేరాలంటే ఎస్ఎంఎస్ చేయండి: కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి పోలీసు భద్రత తిరస్కరించారు.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి పోలీసు భద్రత తిరస్కరించారు. తన ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదని, తనకు జెడ్ కేటగిరి భద్రత అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ సామాజిక వేత్త మేధా పాట్కర్ తమ పార్టీలో చేరుతున్నారని కేజ్రీవాల్ తెలిపారు.  

లోక్సభ ఎన్నికలపై కన్నేసిన ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో సభ్యత్వ నమోదుకు నేడు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కేజ్రీవాల్ ప్రారంభించారు. జనవరి 26 నాటికి కనీసం కోటి మంది సభ్యులను చేర్చుకోవడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా కేజ్రీవాల్ అన్నారు. తమ పార్టీలో సభ్యులుగా చేరేందుకు 07798220033 నంబర్ ఎస్ఎంఎస్ పంపాలని సూచించారు. ఆప్ లో చేరాలనుకునేవారి పేరు, అసెంబ్లీ పేరుతో ఈ నంబర్ కు ఎస్ఎంఎస్ పంపాలని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement