బ్రేకింగ్‌ న్యూస్‌‌‌: ఆర్నబ్‌ గోస్వామి ఔట్‌! | Arnab Goswami resigns from Times Now | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్‌ న్యూస్‌‌‌: ఆర్నబ్‌ గోస్వామి ఔట్‌!

Nov 1 2016 6:30 PM | Updated on Sep 4 2017 6:53 PM

బ్రేకింగ్‌ న్యూస్‌‌‌: ఆర్నబ్‌ గోస్వామి ఔట్‌!

బ్రేకింగ్‌ న్యూస్‌‌‌: ఆర్నబ్‌ గోస్వామి ఔట్‌!

సీనియర్‌ జర్నలిస్ట్ ఆర్నబ్‌ గోస్వామి ప్రముఖ ఆంగ్ల న్యూస్‌ చానెల్‌ 'టైమ్స్‌ నౌ' ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ పదవి నుంచి తప్పుకొన్నారు.

న్యూఢిల్లీ: సీనియర్‌ జర్నలిస్ట్ ఆర్నబ్‌ గోస్వామి ప్రముఖ ఆంగ్ల న్యూస్‌ చానెల్‌ 'టైమ్స్‌ నౌ'  ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ పదవి నుంచి తప్పుకొన్నారు. ఆయన గతకొన్నిరోజులుగా ప్రైమ్‌టైమ్‌ షో ‘ద న్యూస్‌ అవర్‌'లో కనిపించడం లేదు. ఇటీవల జరిగిన ఎడిటోరియల్‌ మీటింగ్‌లో ఆర్నబ్‌ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎడిటర్‌ పదవి నుంచి తప్పుకున్నట్టు సమాచారం.
 
టైమ్స్‌ నౌ చానెల్‌లో ఆవేశపూరితమైన చర్చలు చేపట్టడం ద్వారా ఆర్నబ్‌ ప్రముఖంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆర్నబ్‌ పలు ఆవేశపూరితమైన టీవీ చర్చలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు 'వై కేటగిరీ' భద్రత కల్పించింది. దీంతో ఇద్దరు వ్యక్తిగత భద్రతాధికారులు సహా మొత్తం 20 మంది భద్రతా సిబ్బంది ఆయనకు నిరంతరం రక్షణ కల్పిస్తున్నారు. ఆర్నబ్‌ రాజీనామా వార్త తెలియడంతో ట్విట్టర్‌లో ఆయన ట్రేండ్‌ అవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement