breaking news
Editor in Chief
-
‘సాక్షి’ ఎడిటర్‌పై సర్కార్ దాష్టీకం
సాక్షి, అమరావతి: పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం ‘సాక్షి’ పత్రికపై కక్షసాధింపును మరింత విస్తృతం చేస్తోంది. అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తూ ప్రజల గొంతుకగా నిలుస్తున్నందుకు అక్రమ కేసులతో బరితెగిస్తోంది. పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటనా హక్కును కాలరాస్తూ కుతంత్రాలకు తెగబడుతోంది. కర్నూలులో రూ.4 వేల కోట్ల ప్రభుత్వ భూములను కొల్లగొట్టేందుకు అధికార టీడీపీ నేతలు పన్నిన కుట్రలను బట్టబయలు చేయడం, ఆ ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తున్నవారి ఆందోళనకు మద్దతుగా నిలిచినందుకు ‘సాక్షి’ పత్రికపై అక్రమ కేసులు నమోదు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ మేరకు విచారణ పేరుతో సోమవారం కర్నూలు పోలీసులు హైదరాబాద్‌లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో హల్చల్ చేశారు. పత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయ్‌రెడ్డికి 35 బీఎన్ఎస్ఎస్ కింద నోటీసులిచ్చారు.ఆధారాలతో కథనాలు.. వేధింపులే లక్ష్యంగా ప్రభుత్వం బాబు సర్కారులో... సాక్షి ప్రధాన కార్యాలయం, ఎడిటర్ ఆర్.ధనుంజయ్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసుల నమోదు, నోటీసులు, విచారణ పేరుతో వేధించడాన్ని పోలీసులు వారి విధానంగా మలుచుకున్నట్లు స్పష్టమవు తోంది. సాక్షి పత్రిక, ఎడిటర్‌పై 19 అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ దాష్టీకానికి నిదర్శనం. అక్రమ కేసులకు కారణమైన కథనాల్లో ఒక్కదాంట్లోనూ ‘సాక్షి’ అవాస్తవాలను ప్రచురించలేదు. పూర్తి ఆధారాలతో ఇస్తూ బాధితులు చెప్పిందే పేర్కొన్నది తప్ప సొంత భాష్యం ఇవ్వలేదు. వాస్తవాలను వక్రీకరించలేదు. అయినా, బాబు ప్రభుత్వ డైరెక్షన్లో పోలీసులు అక్రమ కేసులకు తెగబడుతున్నారు. పోలీసు ఉన్నతాధికా రులు అత్యుత్సాహంతో కొన్ని నమోదు చేయిస్తుండగా... ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకంగా ఆదేశించి మరీ మరికొన్ని నమోదు చేయిస్తున్నారు.బాధితుల పక్షాన నిలిచినందుకే...ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎలుగె త్తడం, బాధితుల ఆవేదనను వెలుగులోకి తేవడమే ‘సాక్షి’ చేసిన నేరం అన్నట్లు చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దల కుట్రపై కర్నూలు జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తు న్నారు. 19 అక్రమ కేసుల్లో 5 ఈ జిల్లాలోనే నమోదవడం దీనికి నిదర్శనం. ఇక ఇటీవల నమోదు చేసిన కేసు మరీ విడ్డూరంగా ఉంది. కర్నూలులోని ఏ, బీ, సీ క్యాంప్ క్వార్టర్లను ఖాళీ చేయించాలని మంత్రి భరత్ ఆదేశించారు.ఆ భూముల్లో స్టేడియం నిర్మిస్తామని ఓసారి, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మరోసారి చెప్పారు. వీటిలో ఏ నిర్మాణానికీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయలేదు. అయినాసరే, అక్కడివారిని బలవంతంగా ఖాళీ చేయించేందుకు మంత్రి భరత్ సంసిద్ధులయ్యారు. కర్రపట్టుకుని మరీ ఖాళీ చేయిస్తామని బహిరంగంగా హెచ్చరించారు. దాంతో దశాబ్దాలుగా ఉంటున్న కుటుంబాలు తీవ్ర నిరసన తెలిపాయి. ‘సాక్షి’ దీన్ని ప్రచురించింది. ఆగ్రహించిన మంత్రి భరత్... సాక్షిపై అక్రమ కేసు నమోదు చేయాలని హుకుం జారీ చేశారు. పోలీసులు జీహుజూర్ అన్నారు. అంతేకాదు సోమవారం ఏకంగా సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చి ఎడిటర్‌కు నోటీసులిచ్చారు.➜భూ వివాదాన్ని సెటిల్ చేసేందుకు ఓ ఉపాధ్యాయుడిని పోలీసులే ఎత్తుకెళ్లారు. దీన్ని వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’పై అక్రమ కేసు నమోదు చేశారు. రాయలసీమలో భారీ దందాకు పాల్పడుతున్న అవినీతి అనకొండ ఐపీఎస్ అధికారి బాగోతాన్ని బయటపెట్టినందుకు మరో అక్రమ కేసు పెట్టారు. ఇక టెండర్లలో ఎవరూ పాల్గొనవద్దని మంత్రి భరత్ అనుచరులు వాట్సాప్ మెసేజులతో బెదిరించారు. ఈ విషయాన్ని ప్రచురించినందుకు సాక్షిపై అక్రమ కేసు నమోదు చేశారు.➜పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రైవేట్ పీఏ సతీశ్... ఒంటరి ఉద్యోగిని ఆర్థికంగా, లైంగికంగా వేధించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని ప్రచురించిన సాక్షిపై సాలూరు పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు.➜పోలీసు శాఖలో అర్హులైన డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతుల్లో అన్యాయం జరగడాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీనిపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులే అక్రమ కేసు నమోదు చేయడం గమనార్హం.➜ఇటీవలి భారీ వర్షాలకు రాజధాని అమరావతి ప్రాంతం ముంపునకు గురైందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి మురళీకృష్ణ విలేకరుల సమావేశంలో విమర్శించారు. సంబంధిత ఫొటోలను ప్రదర్శించారు. దీన్ని ప్రచురించిన సాక్షిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు.➜రాష్ట్రంలో టీడీపీ నేతల నకిలీ మద్యం దందా బట్టబయలవడంతో ప్రభుత్వం కంగారుపడింది. నకలీ మద్యం బాగోతాన్ని వెలుగులోకి తెస్తున్న సాక్షి గొంతు నొక్కేందుకు అక్రమ కేసులకు తెగించింది. కల్తీ మద్యం తాగి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో సందేహాస్పద రీతిలో నలుగురు మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆ వాస్తవాన్ని సాక్షి ప్రచురించగా బాబు సర్కారు తట్టుకోలేపోయింది. నకిలీ మద్యం దందాను అరికట్టడంపై కాక దానిని వెలుగులోకి తెస్తున్న సాక్షిపై కక్షసాధింపునకు దిగారు.ప్రభుత్వం ఆదేశాలతో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్, కలిగిరి, పల్నాడు జిల్లా నరసరావుపేటలో అక్రమంగా క్రిమినల్ కేసులు పెట్టారు. అర్థరాత్రి వేళ హైదరాబాద్, విజయవాడ సాక్షి కార్యాలయాలు, సాక్షి పాత్రికేయుల నివాసాలకు వెళ్లి నోటీసుల పేరుతో వేధించారు. ఎడిటర్ ఆర్.ధనుంజయ్‌రెడ్డికి వాట్సాప్‌లో ముందుగా నోటీసులు పంపారు. వాట్సాప్‌లో నోటీసులు షేరింగ్ వద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించినా దాన్ని ఉల్లంఘించారు. అనంతరం విచారణ పేరుతో పేరుతో ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డికి ఏకంగా 85 ప్రశ్నలతో బుక్లెట్ ఇచ్చారు. పత్రికలు, మీడియా ఎలా విధులు నిర్వర్తిస్తాయనే కనీస అవగాహన లేకుండా ఈ ప్రశ్నావళి ఉంది. న్యూస్ సోర్స్, బాధితుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు గతంలోనే విస్పష్టంగా ప్రకటించింది. కానీ, సాక్షి వద్ద ఆవేదన వెళ్లగక్కిన బాధితుల వివరాలు చెప్పాలని, న్యూస్ సోర్స్ వెల్లడించాలని ఏపీ పోలీసులు ప్రశ్నించడం విస్మయపరిచింది. -
ఎవరీ పిడుగు.. ఎనిమిదేళ్లకే పత్రిక ఎడిటర్‌గా రికార్డ్!
పిల్లలూ! రోజూ పొద్దున్నే న్యూస్‌పేపర్ చదివే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే రకరకాల వార్తలు ఏరి, కూర్చి మనకు అందించేందుకు న్యూస్‌పేపర్ సంస్థలో అనేకమంది పనిచేస్తుంటారు. వారందరికీ బాస్‌గా వ్యవహరించేది ఎడిటర్. ఆ పత్రిక బయటకు రావడంలో ఆయనదే కీలకపాత్ర. ఎడిటర్‌గా స్థానం పొందాలంటే ఎంతో అనుభవం కావాలి. అయితే ఓ పాప మ్యాగజైన్ ఎడిటర్‌గా మారి రికార్డు సృష్టించింది.ఆస్ట్రేలియాకు చెందిన రోక్సాన్ డౌన్స్...ఎనిమిదేళ్లకే ’ఇట్ గర్ల్ మ్యాగజన్’ (It Girl Magazine) అనే మ్యాగ్జైన్ కి ఎడిటర్‌గా మారింది. ఆ వయసున్న చిన్నారులు తోటి పిల్లలతో ఆడుకోవాలని అనుకుంటారు. అయితే రోక్సాన్ మాత్రం ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచనతో ఉంది. తన వయసున్న ఆడపిల్లలు చదువుకునే మ్యాగ్జైన్ రూపొందించాలని భావించింది. దానికి తనే ఎడిటర్‌గా మారింది. మ్యాగ్జైన్లో ఏం రాయాలో, ఎలాంటి అంశాలను చేర్చాలో తెలుసుకునేందుకు రోక్సాన్ చాలా పరిశోధనలు చేసింది. రోజంతా తన వయస్సు గల వారితో తిరుగుతూ వారి ఇష్టాలు, ఇబ్బందులు, వారు ఆసక్తులు గమనించి, వాటి గురించి తన మ్యాగ్జైన్లో వ్యాసాలు రాయడం మొదలుపెట్టింది.చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకంమ్యాగ్జైన్ కోసం ప్రముఖ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ని రోక్సాన్ ఇంటర్వ్యూ చేసింది. అది ప్రఖ్యాతి పొందడంతో ఆ తర్వాత అనేకమంది రచయితలు, టిక్‌టాక్ స్టార్లు, గాయకులు, నటులను ఇంటర్వ్యూలు చేసే స్థితికి చేరుకుంది. ఆ ఇంటర్వ్యూలను వీడియో రూపంలో యూట్యూబ్‌లో చూడొచ్చు. ఓ వైపు మ్యాగ్జైన్ పనులు చేస్తూనే, పాఠశాలకు వెళ్లి చదువుకుంటోంది రోక్సాన్. బద్దకంగా ఉండటం తనకు అస్సలు నచ్చదని, జీవితంలో ఏదైనా సాధించాలన్న ఆకాంక్ష అందరిలోనూ ఉండాలని తను చెపుతోంది.ఇదీ చదవండి: Bakrid speical : నోరూరేలా.. కాలా మటన్ -
గేమ్ ఛేంజర్‌కు పని చేయడం ఓ చేదు అనుభవం.. డైరెక్టర్‌పై విమర్శలు!
ఈ ఏడాది రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా పెద్దగా రాణించలేకపోయింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో అంజలి, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు.అయితే 'గేమ్ ఛేంజర్' డైరెక్టర్ శంకర్‌పై ఎడిటర్ షమీర్ మహమ్మద్ విమర్శలు చేశారు. ఆయనతో పని చేయడం నా జీవితంలో చేదు అనుభవమని చెప్పారు. దర్శకుడు శంకర్‌తో కలిసి పనిచేయడం చాలా దారుణంగా అనిపించిందని షమీర్ మహమ్మద్ వెల్లడించారు. నేను చాలా ఉత్సాహంగా అక్కడికి వెళ్తే.. నాకు అక్కడ అంతా భిన్నంగా ఉందని అన్నారు.ఎడిటర్ షమీర్ మహమ్మద్ మాట్లాడుతూ.. 'గేమ్ ఛేంజర్ కోసం దాదాపు ఒక సంవత్సరం పనిచేశా. ఆరు నెలల తర్వాత వారితో మరో నెల రోజులు ఉండాల్సి ఉంటుందని నాతో చెప్పారు. నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు సినిమా నిడివి 7 గంటల నుంచి 7.30 గంటలు. దానిని మూడున్నర గంటలకు తగ్గించా. ఆ తర్వాత మరో కొత్త ఎడిటర్ వచ్చి దానిని రెండున్నర నుంచి 3 గంటలకు కుదించాడు. డైరెక్టర్ ఎడిటింగ్ కోసం ఒక తేదీని నిర్ణయించేవాడు. కానీ పది రోజుల తర్వాత మాత్రమే వచ్చేవాడు. అదే పద్ధతి చాలా రోజులు కొనసాగింది. దీంతో నేను 300-350 రోజులు చెన్నైలో ఉన్నా. అందుకే ఈ సినిమాను మధ్యలో వదిలేయాల్సి వచ్చింది" అని అన్నారు. కానీ షమీర్ ప్రాజెక్ట్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఎడిటర్ రూబెన్‌ను తీసుకున్నారు. -
సినిమాకు అతను చాలా ముఖ్యం.. లేకపోతే కాళ్లు, చేతులు ఆడవు: సిద్ధు జొన్నలగడ్డ
టిల్లు స్క్వేర్ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం జాక్. ఈ మూవీకి బొమ్మిరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో జాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మన సినీ ఇండస్ట్రీలో ఎడిటర్ గురించి ఎవరూ మాట్లాడరని అన్నారు. టిల్లు స్క్వేర్, తండేల్, మ్యాడ్ స్క్వేర్ హిట్ అయ్యాయంటే ఎడిటర్ నవీన్ నూలి మాత్రమే కారణమన్నారు. కానీ సినిమాకు ఎడిటర్ అనేవారు చాలా ముఖ్యం.. ఆయన లేకపోతే దర్శకుడికి కాళ్లు, చేతులు ఆడవని సిద్ధు అన్నారు. మనం చాలా తక్కువగా ఎడిటర్ గురించి మట్లాడతాం.. కానీ వారే సినిమాకు చాలా ప్రధానమని ఆయన తెలిపారు. మా జాక్ సినిమాకు నవీన్ నూలినే ఎడిటర్.. ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు.అలాగే రానా ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కాకపోవడంపై కూడా సిద్ధు స్పందించారు. రానా ప్రస్తుతం ముంబయిలో ఉన్నారని తెలిపారు. రానా నాయుడు సీజన్-2 డబ్బింగ్‌తో బిజీగా ఉన్నారని సిద్ధు వెల్లడించారు. సాయంత్రం ఐదున్నరకు రావాల్సిన విమానం మిస్ కావడంతోనే రానా రాలేకపోయారని సిద్ధు క్లారిటీ ఇచ్చారు. -
Lok sabha elections 2024: హెడ్లైన్లు కాదు.. డెడ్లైన్ల కోసం పని చేస్తున్నా
న్యూఢిల్లీ: మీడియాలో ప్రచారం కోసం, పత్రికల్లో హెడ్లైన్ల కోసం తాను ఆరాటపడే వ్యక్తిని కాదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. హెడ్లైన్ల కోసం కాకుండా, డెడ్లైన్ల కోసం పని చేస్తున్నామని స్పష్టం చేశారు. శనివారం ‘ఇండియా టుడే’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. తొలుత ఇండియా టుడే ఎడిటర్–ఇన్–చీఫ్ అరుణ్ పురీ ప్రారం¿ోపన్యాసం చేశారు. 2029 జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం మోదీ సిద్ధమవుతున్నారని చెప్పారు. అనంతరం మోదీ ప్రసంగించారు. 2029 ఎన్నికల కోసం కాదు, 2047 ఎన్నికల కోసం సిద్ధమవుతున్నానని పేర్కొన్నారు. మీరు 2029లోనే ఆగిపోయారు, నేను మాత్రం 2047 కోసం ఇప్పటినుంచే కార్యాచరణ ప్రారంభించానని అరుణ్ పురీని ఉద్దేశించి చెప్పారు. మోదీ ఏం చేయబోతున్నారో తెలుసుకోవడానికి మీ మొత్తం బృందాన్ని రంగంలోకి దించండి అని సూచించారు. తాము వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గి, అధికారం నిలబెట్టుకుంటామని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ఐదేళ్లలో దేశ ప్రజలు నిర్ణయాత్మక విధానాలను చూడబోతున్నారని చెప్పారు. కీలకమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేయబోతున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత్ మాత్రం వృద్ధిబాటలో మరింత వేగంగా పరుగులు తీయబోతోందని స్పష్టం చేశారు. ‘దేశమే ప్రథమం’ అనే విధానంతో తాను ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు. కొందరికి మాత్రం ‘కుటుంబమే ప్రథమం’ అంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ‘స్థిరమైన, సమర్థవంతమైన, బలమైన ఇండియా’ అనేది వచ్చే ఐదేళ్ల కాలం ప్రపంచానికి ఇవ్వబోతున్న గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. దేశంలో అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరబోతోందన్నారు. అవినీతిని సహించం అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని, ఈ విషయంలో దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. అవినీతిని సహించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. తాము అవినీతిపై ఉక్కుపాదం మోపుతుండడంతో కొందరు కడుపు మంటతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు తనను ఇష్టానుసారంగా దూషిస్తున్నారని, వారిని ప్రజలు ఏమాత్రం విశ్వసించడం లేదని చెప్పారు. తమ పదేళ్ల పదవీ కాలంలో పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేశామని, వాటికి మీడియాలో గుర్తింపు రానప్పటికీ లబి్ధదారులపై ఎంతో ప్రభావం చూపాయని వివరించారు. కాలం చెల్లిన వందలాది చట్టాలను, నియంత్రణలను తొలగించామని మోదీ గుర్తుచేశారు. -
నూహ్ అల్లర్లు: ప్రముఖ టీవీ ఛానల్ ఎడిటర్ అరెస్టు..
చంఢీగర్: నూహ్ అల్లర్లలో అసత్యాలను ప్రచారం చేశారనే ఆరోపణలపై హిందీ ఛానల్ సుదర్శన్ టీవీ ఎడిటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లను మరింత పెంచేంతగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు ఆరోపించారు. సుదర్శన్ టీవీ ఛానల్ ఎడిటర్ ముఖేష్ కుమార్‌ను గురుగ్రామ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. కొంతమంది గుండాలు అతన్ని అరెస్టు చేసినట్లు సుదర్శన్ ఛానల్ పేర్కొంది. దీనిపై వివరణ ఇచ్చిన పోలీసులు.. సైబర్ క్రై విభాగం అరెస్టు చేసినట్లు చెప్పారు. गुड़गांव की पुलिस कमिश्नर को @AJENews (अल जजीरा न्यूज चैनल) से फ़ोन किया जा रहा है हिंदुओं के खिलाफ कार्रवाई के लिए दबाव बनाया जा रहा है। और @DC_Gurugram फोन आने के बाद इतने दबाव में आ जाती हैं कि कहीं से भी हिंदूवादी कार्यकर्ताओं को उठा ले रही है@cmohry कृपया संज्ञान लें pic.twitter.com/bIjVYfR0Di — Mukesh Kumar (@mukeshkrd) August 8, 2023 ఆల్ జజిరా ఛానల్ ఒత్తిడి మేరకు గురుగ్రామ్ పోలీసులు.. హిందు కార్యకర్తల మీద చర్యలు తీసుకుంటున్నారని ట్వీట్టర్లో ముఖేష్ కుమార్ పోస్టు చేశారు. గురుగ్రామ్ పోలీసులకు విదేశీ మీడియా కాల్ చేసిందని ఈ మేరకు హిందువులపై చర్యలు తీసుకుంటున్నారని ఎడిటర్ ఆరోపణలు చేస్తూ పోస్టులు చేశారు. pic.twitter.com/FbtdApa5zq — Gurugram Police (@gurgaonpolice) August 11, 2023 దీనిపై స్పందించిన పోలీసులు..కుమార్ పోస్టులు నిరాధారమైనవని కొట్టిపడేశారు. తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని అన్నారు. ఐటీ చట్టం కింద అతనిపై చర్యలకు ఉపక్రమించినట్లు చెప్పారు. అయితే.. విధుల్లో భాగంగా కుమార్ మేవాత్ ప్రాంతానికి వెళ్లినట్లు సుదర్శన్ టీవీ తెలిపింది. కొందరు దుండగులు ఆయన్ను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. పోలీసుల చర్యలను తప్పుబడుతూ సుదర్శన్ టీవీ ఛానల్ చీఫ్ ఎడిటర్ సురేష్ వాంఖడే ట్వీట్ చేశారు. అయితే.. కొన్ని గంటల తర్వాత ముఖేష్ కుమార్‌ను విడుదల చేసినట్లు సమాచారం. मुकेश कुमार को छोड़ा नहीं गया तो कल बड़ी घोषणा करेंगे। देखते है कौन- कौन मर्द हिंदू साथ है। नपुंसक तो जान कर भी मौन हैं। किसी अधिकारी की इतनी हिंम्मत और सभी असहाय…? हम तो असहाय नहीं है… #ReleaseMukeshKunar — Suresh Chavhanke “Sudarshan News” (@SureshChavhanke) August 11, 2023 హర్యానాలోని నూహ్‌లో జులై 31న అల్లర్లు చెలరేగాయి.విశ్వహిందూ పరిషత్ రథయాత్ర సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమై.. రాష్ట్రం మొత్తం వ్యాపించాయి. ఈ ఆందోళనల్లో ఆరుగురు మరణించారు. ఇదీ చదవండి: తప్పుడు వాగ్దానంతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు.. -
సిబ్బంది కోసం ఎడిటర్ షాకింగ్ నిర్ణయం.. మామూలు త్యాగం కాదంటు ప్రశంసలు!
త్యాగం అనే పేరు సినిమాల్లో ఎక్కువగా ఉంటాం. కానీ అదే త్యాగాన్ని నిజ జీవితంలో ప్రజలు పాటించడం చాలా అరుదనే చెప్పాలి. అలాంటి ఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన సిబ్బంది కోసం తన ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌లోకి వచ్చింది. అసలు ఆ స్టోరీ ఏంటంటే! అమెరికా మిచిగాన్‌లోని డెట్రాయిట్ కేంద్రంగా పనిచేసే అతిపెద్ద వార్తా పత్రిక డెట్రాయిట్ ఫ్రీ ప్రెస్. ఆ సంస్థ ఎడిటర్, వైస్ ప్రెసిడెంట్ పీటర్ భాటియా తీసుకున్న గొప్ప నిర్ణయం ప్రస్తుతం ఆ ప్రాంతమంతా చర్చనీయాంశమైంది. షాకింగ్ డెసిషన్ వివరాల్లోకి వెళితే.. ఎప్పటిలానే పీటర్ డిసెంబర్ 23న తమ సిబ్బందితో వర్చువల్‌గా సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. అందులో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇది సాధారణమైన విషయమే కానీ తన రిజైన్ వెనుక ఉన్న నిజం తెలిస్తే ఎవరైనా శభాష్ పీటర్ అని అనాల్సిందే. ఇటీవలి కాలంలో ప్రపంచవాప్తంగా పలు కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి లేఆఫ్స్ దారిలో వెళుతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో డెట్రాయిట్ ఫ్రీ ప్రెస్ అదే దారిని అనుసరించాలని నిర్ణయించుకుంది. ఇది ఆ సంస్థ ఎడిటర్ పీటర్‌కు ఏ మ్రాతం ఇష్టం లేదు. ఉద్యోగుల తొలగింపులు ఇష్టపడని ఆయన ఓ నిర్ణయం తీసుకున్నాడు. స్వయంగా ఆయనే తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన రాజీనామకు కారణం ఇదే సంస్థ బడ్జెట్లో తన జీతం ఆదా చేయడం వల్ల కొంతమంది సిబ్బంది వారి ఉద్యోగాలు కోల్పోకుండా ఆపే అవకాశం ఉందని పీటర్ భావించారు. అంతేకాకుండా తనకు ఇతర ఉపాధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. బలవంతపు తొలగింపుల వల్ల న్యూస్‌రూమ్ ప్రభావితమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా డిసెంబర్ 12న తొలగింపు నిర్ణయం సిబ్బందికి తెలిపారు.ఈ లేఆఫ్‌ల కారణంగా ఐదుగురు రిపోర్టర్లు, నలుగురు అసిస్టెంట్ ఎడిటర్లు, ముగ్గురు వెబ్సైట్ ప్రొడ్యూసర్లు, ఒక ఫోటోగ్రాఫర్, ఒక ఎడిటోరియల్ అసిస్టెంట్ వరకు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు. అందుకే పీటర్ తన రాజీనామాకు సిద్ధమయ్యారు. అందులోని ఓ ఉద్యోగి మాట్లాడుతూ.. సృజనాత్మక నాయకుడిగా ఉన్న భాటియా కారణంగా ఫ్రీ ప్రెస్ ప్రస్తుతం గానెట్ నెట్‌వర్క్‌లోని బలమైన ప్రచురణలలో ఒకటిగా పేరు సంపాదించిందని చెప్పాడు. భాటియా భర్తీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అతను ఆశిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల నుంచి తన భర్తీని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు భాటియా స్వయంగా ప్రకటించారు. -
ఎడిటర్–ఇన్–చీఫ్ రాయిటర్స్‌కు తొలి మహిళ
వార్తా పత్రికల్లో అనేకమంది ఎడిటర్లు ఉంటారు. పత్రికా కార్యాలయంలో ఎన్ని ప్రత్యేకమైన వార్తా విభాగాలు ఉంటే అంతమంది ఎడిటర్లు. వాళ్లందరి పైనా మళ్లీ ఒక ఎడిటర్ ఉంటారు. వారే ఎడిటర్–ఇన్–చీఫ్. లేదా చీఫ్ ఎడిటర్. ‘రాయిటర్స్’.. ప్రపంచానికి ఎప్పటికప్పుడు వార్తల్ని, వార్తా కథనాల్ని అందిస్తూ వస్తున్న విశ్వసనీయ వార్తా సంస్థ. ఆ సంస్థకు ఇంతవరకు ఒక మహిళా చీఫ్ ఎడిటర్ లేనే లేరు. ఇప్పుడు తొలిసారి అలెస్సాండ్రా గలోనీ అనే మహిళ ఆ బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు! 170 ఏళ్ల చరిత్ర గల రాయిటర్స్ని ఈ నెల 19 నుంచి 47 ఏళ్ల వయసు గల గలోనీ నడిపించబోతున్నారు! మహామహులకు మాత్రమే దక్కే ఇంత పెద్ద అవకాశం చిన్న వయసులోనే ఆమె సాధించగలిగారు! రాయిటర్స్ ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది. అక్కడ తన ‘ఎడిటర్–ఇన్–చీఫ్’ సీట్లో కూర్చొని దేశదేశాల్లోని 2,500 మంది సీనియర్ జర్నలిస్టులకు దిశానిర్దేశం చేయబోతున్నారు గలోని! రాయిటర్స్ న్యూస్ రూమ్ దాదాపుగా ఒక వార్ రూమ్. అక్కడ నిరంతరం తలపండిన పాత్రికేయుల సమాలోచనలు జరుగుతుంటాయి. వార్తని ‘ఛేదించడం’, ‘సాధించడం’ వారి ప్రధాన లక్ష్యాలు. వాళ్లందరికీ ఇక నుంచీ లీడర్.. గలోనీ. న్యూస్ రూమ్‌లో ప్రణాళికలను రూపొందిస్తూనే, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 ప్రాంతాలలో ఉన్న రిపోర్టర్లతో ఆమె ఎప్పుడూ అనుసంధానమై ఉండాలి. చిన్న పని కాదు. అలాగని పురుషులకే పరిమితమైన పని కాదని ఇప్పుడీ కొత్త నియామకంతో రాయిటర్స్ తేల్చి చెప్పింది. ఇప్పటికి వరకు ఎడిటర్–ఇన్–చీఫ్‌గా ఉన్న స్టీఫెన్ ఆల్డర్ వయసు 66. రాయిటర్స్ గ్లోబల్ మేనేజింగ్ ఎడిటర్ హోదాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అలెస్సాండ్రా గలోనీ. గత పదేళ్లుగా ఆయన న్యూస్ రూమ్‌కి సారథ్యం వహిస్తున్నారు. అనుభవజ్ఞుడు. ఆయన రిటైర్ అయితే తర్వాత ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు.. రాయిటర్స్లోనే ‘గ్లోబల్ మేనేజింగ్ ఎడిటర్’గా ఉన్న గలోనీనే సరైన ఎంపికగా నిలిచారు! ఐదేళ్లుగా ఆ పదవిలో ఉన్న గలోనీదే న్యూస్ ప్లానింగ్ అంతా. 2015లో రాయిటర్స్లోకి రాకముందు వరకు మరొక ప్రఖ్యాత వార్తా సంస్థ ‘వాల్ స్ట్రీట్ జర్నల్’లో 2013 నుంచీ దక్షిణ ఐరోపా బ్యూరో లో ఉన్నారు. ఎడిటర్–ఇన్–చీఫ్‌గా గత సోమవారం అనేక ఊహాగానాల మధ్య గలోనీ పేరును బహిర్గతం చేస్తూ.. ‘‘ఈ పదవికి తగిన వ్యక్తి కోసం లోపల, బయట విస్తృత పరిధిలో అనేకమంది అత్యంత యోగ్యులైన వారిని దృష్టిలో ఉంచుకున్న అనంతరం మా వెతుకులాట అలెస్సాడ్రా గలోని దగ్గర ఆగింది’’ అని రాయిటర్స్ ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రైడెన్‌బర్గ్ ప్రకటించారు. గలోనీ రోమన్ మహిళ. నాలుగు భాషలు వచ్చు. బిజినెస్, పొలిటికల్ వార్తల్లో నిపుణురాలు. ప్రపంచ వాణిజ్య, రాజకీయ రంగాలలో ఏం జరగబోతోందీ, అవి ఎలాంటి మలుపులు తిరగబోతున్నదీ ముందే ఊహించగల అధ్యయనశీలి, అనుభవజ్ఞురాలు. ఆమె కెరీర్ ప్రారంభం అయింది కూడా రాయిటర్స్లోనే. ఇటాలియన్ లాంగ్వేజ్ న్యూస్ రిపోర్టర్‌గా చేరి, కొద్ది కాలంలోనే ‘ఎడిటర్–ఇన్–చీఫ్’గా ఎదిగారు! జర్నలిజంలో అత్యంత విశేష పురస్కారం అయిన ‘గెరాల్డ్ లోయెబ్ పౌండేషన్’ వారి 2020 మినార్డ్ ఎడిటర్ అవార్డు విజేత గలోనీనే! ఇంకా ఆమె ‘ఓవర్సీస్ ప్రెస్ క్లబ్ అవార్డు’, యు.కె. ‘బిజినెస్ జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ల విజేత కూడా. గలోనీ హార్వర్డ్ యూనివర్సిటీలోని ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’లో చదివారు. తన బాధ్యతల గురించి మాట్లాడుతూ ‘‘ప్రతిభ, అంకితభావం గల జర్నలిస్టులతో నిండి ఉండే ప్రపంచ స్థాయి న్యూస్ రూమ్‌ను నడిపించే వకాశం రావడం నాకు లభించిన గౌరవం’’ అని అన్నారు గలోనీ. -
రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు
సాక్షి,ముంబై: ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై, రాయ్‌గడ్ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో డిజైనర్ ఆత్మహత్యకు పురికొల్పాలరనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను కస్టడీలోకి తీసుకున్నామని ముంబై పోలీసులు ప్రకటించారు. ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్యకు సంబంధించి బుధవారం అర్నాబ్‌ను అదుపులోకి తీసుకున్నారని రిపబ్లిక్ టీవీ నివేదించింది. ఐపీసీ సెక్షన్ 306 కింద గోస్వామిపై అభియోగాలు మోపారని తెలిపింది. కనీసం 20మంది పోలీసులు అర్నాబ్‌పై దాడి చేశారని, ఆపై బలవంతంగా మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు తీసుకెళ్లారని ఆరోపించింది. అర్నాబ్ గోస్వామిని అరెస్టు చేయడానికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజ్‌ను పంపినట్లు రిపబ్లిక్ టీవీ తెలిపింది. ఏకే 47, సెమీ ఆటోమేటిక్ ఆయుధాలతో సాయుధ గార్డులు ఆయనపై దాడి చేశారని వ్యాఖ్యానించింది. జుట్టు పట్టుకొని లాక్కెళ్లారు ఉదయమే తమ ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఆర్నాబ్‌ను కొట్టి, జుట్టు పట్టి లాక్కెళ్లారని అర్నాబ్ భార్య సమ్యబ్రాతా రే ఆరోపించారు, కొద్ది సమయం అడిగినా ఇవ్వకుండా, లాయర్ వచ్చేంతవరకు వేచి చూడాలని కోరినా వినకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీళ్లు అడిగినా ఇవ్వకుండా తీసుకెళ్లారని మండిపడ్డారు. ఛానెల్లోని విజువల్స్ ప్రకారం అర్నాబ్‌ను మొదట కారులో ఉంచి, ఆపై వ్యాన్‌లోకి నెట్టారు. అతన్ని వ్యాన్‌లోకి తీసుకెళ్తుండగా, తన ఇంటి లోపల తనపై, తన కుటుంబ సభ్యులపై దాడి జరిగిందని ఆర్నాబ్ మీడియాకు చెప్పారు. కాగా ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్, అతని తల్లి కుముద్ నాయక్‌తో కలిసి మే, 2018లో అలీబాగ్‌లోని వారి బంగ్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. రిపబ్లిక్ టీవీ స్టూడియోలను రూపొందించిన డిజైనర్ అన్వే నాయక్‌కు బిల్లులు చెల్లించకపోవడంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో అర్నాబ్‌పై రాయ్‌గడ్‌లో కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్థానిక రాయ్‌గడ్ పోలీసులు గోస్వామితో సహా సూసైడ్ నోట్లో పేర్కొన్న నిందితులపై తమకు ఆధారాలు దొరకలేదని 2019 ఏప్రిల్‌లో కేసును మూసివేశారు. అయితే, ఈ ఏడాది మేలో, అన్వే కుమార్తె ఈ కేసుపై తిరిగి దర్యాప్తు చేయాలని కోరుతూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌ను ఆశ్రయించారు. -
టాటా సన్స్ చైర్మన్‌గా ఆర్నాబ్ గోస్వామి?
న్యూఢిల్లీ: ‘టైమ్స్ నౌ’ టీవీ ఛానెల్ ఎడిటర్ పదవికి రాజీనామా చేసినట్లు భావిస్తున్న ఆర్నాబ్ గోస్వామికి ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో ఖాతా లేకపోయినా, ఫాలోవర్లు మాత్రం పుంఖానుపుంఖంగా ఉన్నారు. ఆర్నాబ్ తన పదవికి రాజీనామా చే సినట్లు వార్త వెలువడగానే ఆగమేఘాల మీద యూజర్లు స్పందించి తమదైన రీతిలో ట్వీట్లు చేశారు. స్వీట్లు పంచారు. ‘ఇంతకాలం టీవీలో అనధికార జడ్జీగా వ్యవహరించిన ఆర్నాబ్ ఇప్పుడు అధికారికంగా సుప్రీం కోర్టు జడ్జీగా వెళ్లేందుకు రాజీనామా చేశారు......కాదు, కాదు, పాకిస్థాన్‌తో యుద్ధం చేసేందుకు భారత ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్లారు....అదికాదు, టాటా సన్స్ చైర్మన్ పదవిని చేపట్టేందుకు వెళ్లారు....ఆర్నాబ్ నిష్క్రమణతో టైమ్స్ నౌ ‘వ్యాల్యూ’ సారీ, సారీ ‘వ్యాల్యూమ్’ తగ్గింది......మొన్న టాటా సన్స్‌లో, నిన్న ట్విట్టర్లో, నేడు టైమ్స్ నౌలో ఉన్నత పదవులు ఖాళీ, అర్హులు ధరఖాస్తు చేసుకోండి....ఆర్నాబ్ రాజీనామా ఎలా చేసి ఉంటారు? కచ్చితంగా అరచి, గీపెట్టి చెప్పే ఉంటారు.....ఆయన చెప్పా పెట్టకుండా రాజీనామా చేస్తే ఎలా? నా అభిప్రాయం ఎలా ఉండాలో ఇప్పుడు నాకెవరు చెబుతారు?....ఎస్ఎమ్మెస్ పోల్ లేకుండా ఎలా రాజీనామా చేస్తారు?..... ‘24 గంటలపాటు ఆర్నాబ్‌ను భరించే ఛానెల్ పెట్టే దమ్ము ఎవరికైనా ఉందా?....దీపావళి అంటే నిజంగా ఇదే, పటాసుల పేలుళ్లు లేకుండా ప్రశాంతంగా ఉంది....నేను మాత్రం ఒక్క క్షణం టపాసులు పేలుస్తా కాలుష్యం పోయినందుకు....తూ కిత్నే ఆర్నాబ్కో మారేగా హర్ ఛానెల్ సే ఏక్ ఆర్నాబ్ నిక్లేగా.....ఆర్నాబ్ నిష్క్రమణకు ఆందోళనే అవసరంలేదు ఛానెల్, ఆర్కీవ్స్ నుంచి పాత న్యూస్ అవర్ కార్యక్రమాల వీడియోలు ప్రసారం చేస్తే చాలు, తేడా ఎవరూ గుర్తించరు...’ అంటూ ట్వీట్లు ఇలా సాగిపోతున్నాయి. ఆర్నాబ్ గోస్వామి రాజీనామా గురించి తానుగానీ, టైమ్స్ నౌగాని ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ పాశ్చాత్య మీడియాను కాలదన్నే స్థాయిలో భారత్ మీడియా సామ్రాజ్యం ఎదగాలని ఆయన ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు కనుక అలాంటి ప్రయత్నాల్లో భాగంగానే ఆయన బయటకు వెళ్లి ఉంటారని....తాను సొంతంగా ఎప్పటి నుంచో ఓ మీడియా చానెల్ ప్రారంభించాలన్నది ఆయన కోరికని, ఆ ప్రయత్నాల్లోనే ఆయన రాజీనామా చేసి ఉంటారని ఊహాగానాలు చెలరేగులుతున్నాయి. Arnab Goswami 'resigns' from Times Now. To start his own venture. After being one unofficially. He will now officially become S.C. Judge. — Sorabh Pant (@hankypanty) 1 November 2016 Arnab the new Chairman of Tata Sons? — ClooneyOfKerala (@sidin) November 1, 2016 -
బ్రేకింగ్ న్యూస్: ఆర్నబ్ గోస్వామి ఔట్!
న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి ప్రముఖ ఆంగ్ల న్యూస్ చానెల్ 'టైమ్స్ నౌ' ఎడిటర్ ఇన్ చీఫ్ పదవి నుంచి తప్పుకొన్నారు. ఆయన గతకొన్నిరోజులుగా ప్రైమ్‌టైమ్ షో ‘ద న్యూస్ అవర్'లో కనిపించడం లేదు. ఇటీవల జరిగిన ఎడిటోరియల్ మీటింగ్‌లో ఆర్నబ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎడిటర్ పదవి నుంచి తప్పుకున్నట్టు సమాచారం. టైమ్స్ నౌ చానెల్లో ఆవేశపూరితమైన చర్చలు చేపట్టడం ద్వారా ఆర్నబ్ ప్రముఖంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆర్నబ్ పలు ఆవేశపూరితమైన టీవీ చర్చలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు 'వై కేటగిరీ' భద్రత కల్పించింది. దీంతో ఇద్దరు వ్యక్తిగత భద్రతాధికారులు సహా మొత్తం 20 మంది భద్రతా సిబ్బంది ఆయనకు నిరంతరం రక్షణ కల్పిస్తున్నారు. ఆర్నబ్ రాజీనామా వార్త తెలియడంతో ట్విట్టర్లో ఆయన ట్రేండ్ అవుతున్నారు.


