ఆ భయంతోనే బాబు తప్పుడు ప్రచారం! | apcc chief raghuveera reddy slams cm chandrababu on special status issue | Sakshi
Sakshi News home page

ఆ భయంతోనే బాబు తప్పుడు ప్రచారం!

Oct 6 2016 8:34 PM | Updated on Mar 23 2019 9:10 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్‌ రఘువీరారెడ్డి విమర్శించారు.

విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర ప్యాకేజీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అందుకే టీడీపీ నేతలకు శిక్షణ కార్యక్రమంలో ఆయన ప్యాకేజీ జపం చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్‌ రఘువీరారెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి ప్రత్యేక హోదాతోనే సాధ్యం అని పేర్కొంటూ హోదా కోసం గతంలో చంద్రబాబు మహానాడులో తీర్మానం చేశారని, కానీ హోదా సాధించుకొనే శక్తి లేక.. తన సొంత ప్రయోజనాల కోసం హోదాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. టీడీపీ నేతల శిక్షణ తరగతుల్లో ప్యాకేజీపై ప్రచారం చేయాలని తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు చెప్పడం వెనుక ఆయనకున్న భయం అర్థమవుతోందని పేర్కొన్నారు.  

హోదా కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని గతంలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు సొంతప్రయోజనాల కోసమే ప్యాకేజీని స్వాగతిస్తున్నారని రఘువీరా విమర్శించారు. హోదా విషయంలో 'ప్రజల వద్దకే కాంగ్రెస్‌' పేరిట తిరుపతిలో ప్రజాబ్యాలెట్‌ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిందని, రానున్న రోజుల్లో ప్రజలే హోదా కావాలా? వద్దా? అనేది చెపుతారని ఆయన పేర్కొన్నారు. హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్‌ పోరాడుతుందని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement