బాంబు పేల్చిన బాబాయ్.. వీడియో రిలీజ్ | akhilesh seeks motor cycle symbol, says shivpal yadav | Sakshi
Sakshi News home page

బాంబు పేల్చిన బాబాయ్.. వీడియో రిలీజ్

Jan 9 2017 6:42 PM | Updated on Aug 14 2018 9:04 PM

బాంబు పేల్చిన బాబాయ్.. వీడియో రిలీజ్ - Sakshi

బాంబు పేల్చిన బాబాయ్.. వీడియో రిలీజ్

సమాజ్‌వాదీ పార్టీ సంక్షోభం నిమిషానికో మలుపు తిరుగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌పై ఆయన బాబాయ్ శివపాల్ యాదవ్ సరికొత్త బాంబు పేల్చారు.

సమాజ్‌వాదీ పార్టీ సంక్షోభం నిమిషానికో మలుపు తిరుగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌పై ఆయన బాబాయ్ శివపాల్ యాదవ్ సరికొత్త బాంబు పేల్చారు. అఖిలేష్ వర్గం తమకు మోటార్ సైకిల్ గుర్తు కావాలని ఎన్నికల సంఘాన్ని కోరిందని, ఇందుకోసం నెల రోజుల క్రితమే ఎన్నికల కమిషన్‌ను కలిసిందని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. 
 
వాస్తవానికి సోమవారం లోగా పార్టీలో ఎవరికి ఎంత బలం ఉందో తెలియజేయాలంటూ ఎన్నికల కమిషన్ రెండు వర్గాలకు గడువు విధించిన విషయం తెలిసిందే. దాంతో అఖిలేష్ వర్గానికి చెందిన బహిష్కృత సమాజ్‌వాదీ నేత రాంగోపాల్ యాదవ్ భారీ మొత్తంలో అఫిడవిట్లను తీసుకెళ్లి కమిషన్‌కు ఇచ్చారు. కానీ వాటి మీద సంతకాలు ఫోర్జరీవని ములాయం, అమర్‌సింగ్ ఇద్దరూ అన్నారు. మరోవైపు రాంగోపాల్ యాదవ్‌ను పార్లమెంటరీ పార్టీ నేత పదవి నుంచి తొలగించాలని కూడా ములాయం కోరారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు శివపాల్ యాదవ్ విడుదల చేసిన వీడియో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
 
Advertisement
 
Advertisement
Advertisement