యూపీ చిన్నబాబుకు రాహుల్‌ అనూహ్య ప్రశంసలు! | Akhilesh ladka theek hai, says Rahul Gnadhi thinks of Uttar Pradesh CM | Sakshi
Sakshi News home page

చిన్నబాబుకు రాహుల్‌ అనూహ్య ప్రశంసలు!

Jul 30 2016 9:26 AM | Updated on Mar 18 2019 9:02 PM

యూపీ చిన్నబాబుకు రాహుల్‌ అనూహ్య ప్రశంసలు! - Sakshi

యూపీ చిన్నబాబుకు రాహుల్‌ అనూహ్య ప్రశంసలు!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నుంచి ఊహించని ప్రశంసలు లభించాయి.

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నుంచి ఊహించని ప్రశంసలు లభించాయి. 43 ఏళ్ల అఖిలేశ్‌ను ‘మంచి బాలుడు’ (థీక్‌ లడ్క) అంటూ మెచ్చుకున్నారు. అయితే, వ్యక్తిగతంగా అఖిలేశ్ ను గుడ్‌బాయ్‌ అని మెచ్చుకున్న రాహుల్‌.. ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు.

లక్నోలో శుక్రవారం కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార భేరిని మోగించిన రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘యువ ముఖ్యమంత్రిని చూడండి. ఆయన మంచి బాలుడు. కానీ ఆయన ప్రభుత్వం మాత్రం పనిచేయడం లేదు’ అని విమర్శించారు. ఎస్పీ ప్రభుత్వం హయాంలో యూపీలో శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయని ఆయన మండిపడ్డారు. ఒకవైపు బీఎస్పీ అవినీతిని ప్రోత్సహిస్తుంటే, మరోవైపు ఎస్సీ గూండాగిరిని ప్రోత్సహిస్తున్నదని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement