విమానంలో 'కాక్రోచ్ మీల్' | Air India 'serves' cockroach-meal on flight | Sakshi
Sakshi News home page

విమానంలో 'కాక్రోచ్ మీల్'

Nov 18 2016 1:39 PM | Updated on Oct 2 2018 8:04 PM

విమానంలో 'కాక్రోచ్ మీల్' - Sakshi

విమానంలో 'కాక్రోచ్ మీల్'

ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా మరోసారి చిక్కుల్లో పడింది. ఓ ప్రయాణికుడికి అందించిన భోజనంలో బొద్దింక దర్శనమిచ్చిన ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది.

న్యూఢిల్లీ: ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి చిక్కుల్లో పడింది. ఓ  ప్రయాణికుడికి అందించిన భోజనంలో   బొద్దింక దర్శనమిచ్చిన ఉదంతం  ఒకటి వెలుగులోకి వచ్చింది.ఎయిర్ ఇండియా విమానంలో్  హైదరాబాద్ కు చెందిన రాహుల్ రఘువంశీ  హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా షికాగో  వెళుతుండగా ఈ చేదు అనుభవం ఎదురైంది.  

విమాన సిబ్బంది ఆఫర్ చేసిన  భోజనంలో   బొద్దింక కనిపించడంతో  ఆందోళన చెందిన  రాహుల్ ఈ విషయాన్ని ఫోటోతో సహా ట్విట్టర్ లో షేర్ చేశారు.  ఏఐ127 విమానంలో.. వెజిటిరేయన్  ఫూడ్ లో  సిబ్బంది  బొద్దింకలను వడ్డిస్తున్నారంటూ  వాపోయారు.  అయితే  ఈ సంఘటనపై  తీవ్రంగా స్పందించిన  ఎయిర్ఇండియా ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పింది.  ఎయిర్ ఇండియా తాము ఈ విషయాన్ని అస్సలు సహించమని, వెంటనే  సంబంధిత చర్యల్ని తీసుకుంటామని ట్వీట్ చేసింది.  సంబంధిత  క్యాటరర్ కి నోటీసులు పంపామని  ఎయిర్ ఇండియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్,  సీనియర్ మేనేజర్ ధనంజయ్ కుమార్ తెలిపారు.  దర్యాప్తు జరుగుతోందని  చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement