breaking news
serves
-
ఏ పెట్రోల్ బంక్‌లోనైనా ఈ సేవలు ఫ్రీ.. రోజూ వెళ్లేవారికీ తెలియని విషయాలు
న్యూఢిల్లీ: వాహనం కలిగిన ప్రతీఒక్కరూ తమ వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంక్‌కు తప్పనిసరిగా వెళుతుంటారు. అయితే ఇలా వెళ్లేవారిలో చాలా మందికి అక్కడ లభించే ఉచిత సర్వీసులు గురించి ఏమాత్రం తెలియదు. వినియోగదారుల వాహన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సేవలను ఆయా పెట్రోల్ బంక్‌లు అందిస్తాయి. అవేమిటో వాహనదారులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. బంక్‌లు అందించే ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలి. మరి.. ఆ ఉచిత సేవలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.1. ఉచితంగా గాలిని కొట్టించుకోవచ్చుఏదైనా వాహనానికి గల టైర్లలో తగిన రీతిలో గాలి ఉండటం చాలా ముఖ్యం. పెట్రోల్ బంక్‌ల వద్ద ఉచితంగా వాహనాల టైర్లలో గాలికొట్టించుకోవచ్చు. బంక్లోగల ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా వాహనాల టైర్లలో గాలిని నింపుతారు. ఇందుకోసం బంక్‌లో ఒక ఉద్యోగిని నియమిస్తారు.2.ఫైర్ సేఫ్టీ డివైజ్ఏవో కారణాలతో వాహనంలో పెట్రోల్ నింపుతున్నప్పుడు మంటలు అంటుకుంటే, అదే బంక్‌లో ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ సదుపాయం వినియోగించుకున్నందుకు బంక్‌లో ఎటువంటి ఛార్జీ చెల్లించనవసరం లేదు.3. అత్యవసర కాల్ సౌకర్యంఅత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్ బంక్‌లోని టెలిఫోన్ నుంచి ఉచితంగా కాల్ చేయవచ్చు. అయితే వాహనదారులు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినప్పుడు లేదా బ్యాటరీ ఛార్జింగ్ జోరో అయినప్పుడు మాత్రమే ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు.4. ప్రథమ చికిత్స బాక్సువాహనదారులు ఏదైనా గాయం అయినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్ బంక్‌లో ఉన్న ప్రథమ చికిత్స బాక్సులోని మందులను ఉపయోగించుకోవచ్చు. అయితే ఆ బాక్సులోని మందులు గడువు ముగియనివి అయి ఉండాలని గుర్తుంచుకోండి. పెట్రోల్ పంప్ యజమానులు ప్రథమ చికిత్స బాక్సులలోని మందులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలి.5. మంచినీటి సౌకర్యంపెట్రోల్ పంపులో మంచినీటి సౌకర్యం కూడా ఉచితం. చాలా బంకులలో వాటర్ కూలర్ సదుపాయం కూడా ఉంటుంది. తద్వారా వాహన వినియోగదారులు చల్లని, పరిశుభ్రమైన నీటిని తాగవచ్చు.6. ఉచిత వాష్రూమ్వాహనదారులుతమ ప్రయాణంలో వాష్‌రూమ్ అవసరమైన సందర్భంలో పెట్రోల్ బంక్‌లోని వాష్‌రూమ్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ వాష్‌రూమ్‌లను సాధారణ ప్రజలు కూడా వినియోగించుకోవచ్చు. ఈ ఉచిత సౌకర్యాల కోసం ఏ బంక్‌లోనైనా డబ్బులు వసూలు చేస్తే ఉన్నతాధికారులకు వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు.చాలా మంది వాహనదారులకు బంక్‌లలో అందించే ఈ సేవల గురించి తెలియదు. ఫలితంగా వారు ఇబ్బందులకు ఎదుర్కొంటుంటారు. పెట్రోల్ బంక్ యజమానులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ సేవలను ఉచితంగా అందించడం తప్పనిసరి. పెట్రోల్ బంక్‌లో ఈ సౌకర్యాలు ఉచితంగా అందించకపోయినా, లేదా ఇందుకోసం ఛార్జీలు విధించినా వినియోగదారులు ఆ పెట్రోలియం కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించి, దానిలో ఫిర్యాదు చేయవచ్చు.ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే.. -
కుయ్.. కుయ్ సేవలు నై..
పేదల సంజీవనికి పెద్ద తిప్పలొచ్చింది. డీజిల్, ఇతరత్రా సమస్యలతో 108 వాహనాల నిర్వహణ గాలిలో దీపంలా మారింది. జిల్లాలో వారం రోజులుగా వాహనాలు రోడ్డెక్కకపోవడంతో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, అత్యవసర వైద్యం కోసం ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒక్కో దశలో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారికి సరైన సమయానికి వైద్యం అందక కన్నుమూసే పరిస్థితులు నెలకొన్నాయి. సమస్య వచ్చినప్పుడు ఫోన్ చేసిన ఐదు నిమిషాల్లోనే ప్రమాద స్థలానికి కుయ్.. కుయ్‌మంటూ శబ్దం చేస్తూ పేదల ముంగిట్లో్ల వాలే 108 సేవలకు డీజిల్ కష్టాల వల్ల క్షతగాత్రుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఖమ్మంవైద్యవిభాగం: ప్రాణాపాయ స్థితిలో తక్షణ వైద్య సేవలు అందించే 108 వాహనాల సేవలు డీజిల్ కారణంగా వారం రోజులుగా నిలిచిపోయాయి. బంక్ యజమానులకు రూ.లక్షల్లో బకాయిలు ఉండడంతో వారు 108 వాహనాలకు డీజిల్ పోయడం నిలిపివేశారు. దీంతో సేవలకు అంతరాయం కలుగుతోంది. జిల్లాలో 14 వాహనాలు అత్యవసర సేవలు అందిస్తుండగా.. అందులో 11 వాహనాలు పూర్తిగా షెడ్లకే పరిమితమయ్యాయి. కొన్ని నెలలుగా పేరుకుపోయిన బకాయిలకు సంబంధించిన నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లాలోని మధిర, సత్తుపల్లి, కల్లూరు వాహనాలు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని బంక్ యజమానులకు నచ్చజెప్పి అక్కడి వాహనాలను పైటెట్లు నెట్టుకొస్తున్నారు. వారంలోపు వాటి బకాయిలు చెల్లించని పక్షంలో అవి కూడా షెడ్లకే పరిమితమవుతాయని అక్కడి వాహనాల పైలెట్లు చెబుతున్నారు. రూ.12లక్షల బకాయిలు సాధారణంగా 108 వాహనాలకు సంబంధించి అధికారులు బంక్ యజమానులతో ముందుగానే ఒప్పందం చేసుకుంటారు. మధిర, సత్తుపల్లి, కల్లూరు, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన వాహనాలకు ఆయా ప్రాంతాల్లో బంక్ యజమానులతో ఒప్పందం ఉంటుంది. ప్రతి నెల వాహనాల్లో పోయించిన డీజిల్‌కు అయ్యే ఖర్చు బంక్ యజమానులకు చెల్లిస్తుంటారు. అయితే జిల్లాలోని 14 వాహనాలకు సంబంధించి మూడు, నాలుగు నెలలుగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా రూ.12లక్షల బకాయిలు బంక్ యజమానులకు చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో బంక్ యజమానులు క్రమక్రమంగా డీజిల్ పోయడం నిలిపివేస్తున్నారు. ప్రస్తుతం మూడు వాహనాలు మాత్రమే నడుస్తున్నాయి. రేపో మాపో అవి కూడా మూలనపడనున్నాయి. 108 వాహనాలు రోడ్డెక్కే పరిస్థితి లేకపోవడంతో అత్యవసర సేవలు నిలిచిపోనున్నాయి. రోడ్డు ప్రమాద బాధితులు, ఇతరత్రా అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదాలకు గురైన వారు 108 వాహనాలు లేక మార్గమధ్యలోనే ప్రాణాలు వదలాల్సిన దుస్థితి ఏర్పడింది. మొబైల్ సేవలు ఎప్పుడో? రాష్ట్ర ప్రభుత్వం టూ వీలర్ ద్వారా 108 సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. అందుకుగాను జిల్లాకు రెండు 108 మొబైల్ వాహనాలను సమకూర్చింది. అయితే అవి జిల్లాకు చేరి నెలలు గడుస్తున్నా ఇంతవరకు సేవలు ప్రారంభించలేదు. 108 వాహనం కంటే అతి త్వరగా మారుమూల ప్రాంతాలకు అత్యవసర సేవలు అందించేందుకు మొబైల్ 108 సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిని అందుబాటులోకి తెస్తే కొంతమేర సేవలు విస్తృతమవుతాయి. ఒకపక్క ఉన్న వాహనాలు మూలనపడి ఉండగా.. వచ్చిన వాహనాలను వినియోగంలోకి తేకపోవడంతో అత్యవసర సేవలు జిల్లాలో కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా బకాయిలు చెల్లించి.. 108 వాహనాలతోపాటు ఉన్న మొబైల్ వాహనాలు వినియోగంలోకి తెచ్చి.. ప్రమాదంలో ఉన్న వారిని రక్షించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. పరిష్కారమవుతుంది.. రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. బకాయిలు చెల్లించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. డీజిల్ సమస్య తీరనుంది. ప్రస్తుతం బంక్ యజమానులను ఒప్పించి డీజిల్ పోయించే ఏర్పాట్లు చేస్తున్నాం. మొబైల్ వాహనాలు కూడా ఈ వారంలోనే రోడ్డెక్కుతాయి. త్వరలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. – లక్ష్మణ్, 108 జిల్లా కోఆర్డినేటర్ వైఎస్ ప్రవేశపెట్టిన సేవలకు ఈ దుస్థితి దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 2008లో రాష్ట్రవ్యాప్తంగా 108 సేవలను ప్రారంభించారు. అదే సమయంలో జిల్లాలో కూడా సేవలను అందుబాటులోకి తెచ్చారు. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణులను సకాలంలో ఆస్పత్రులకు 108 వాహనంలో తరలించడంతో వారు తమ బిడ్డతో సహా క్షేమంగా ఇంటికెళ్లేవారు. అలాగే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాత్రులను కాపాడేందుకు సైతం ఫోన్ చేసిన 5 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని.. వారికి ప్రథమ చికిత్స చేసి.. ప్రాణాపాయం నుంచి కాపాడడం నుంచి గుండెనొప్పి, పురుగు మందులు తాగి ఆత్మహత్యలకు పాల్పడిన వారిని కూడా సకాలంలో ఆస్పత్రికి చేర్చి వారికి ప్రాణదానం చేస్తోంది 108 వాహనం. కొన్నేళ్లుగా 108 సేవల కారణంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన వారి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రజలంతా మహానేత ప్రవేశపెట్టిన 108 పథకానికి జేజేలు పలికారు. కానీ.. నేడు పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. డీజిల్ కష్టాలతో సేవలు నిలిచిపోవడంతో క్షతగాత్రులు ఇబ్బంది పడుతున్నారు. వైఎస్సార్ సేవలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
విమానంలో 'కాక్రోచ్ మీల్'
న్యూఢిల్లీ: ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి చిక్కుల్లో పడింది. ఓ ప్రయాణికుడికి అందించిన భోజనంలో బొద్దింక దర్శనమిచ్చిన ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది.ఎయిర్ ఇండియా విమానంలో్ హైదరాబాద్ కు చెందిన రాహుల్ రఘువంశీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా షికాగో వెళుతుండగా ఈ చేదు అనుభవం ఎదురైంది. విమాన సిబ్బంది ఆఫర్ చేసిన భోజనంలో బొద్దింక కనిపించడంతో ఆందోళన చెందిన రాహుల్ ఈ విషయాన్ని ఫోటోతో సహా ట్విట్టర్ లో షేర్ చేశారు. ఏఐ127 విమానంలో.. వెజిటిరేయన్ ఫూడ్ లో సిబ్బంది బొద్దింకలను వడ్డిస్తున్నారంటూ వాపోయారు. అయితే ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించిన ఎయిర్ఇండియా ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పింది. ఎయిర్ ఇండియా తాము ఈ విషయాన్ని అస్సలు సహించమని, వెంటనే సంబంధిత చర్యల్ని తీసుకుంటామని ట్వీట్ చేసింది. సంబంధిత క్యాటరర్ కి నోటీసులు పంపామని ఎయిర్ ఇండియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్, సీనియర్ మేనేజర్ ధనంజయ్ కుమార్ తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. .@airindiain now serves cockroach for vegetarian meals on AI127 #sicktomystomach #traumatized #cockroachinfood pic.twitter.com/SX1DR2Cufy — Rahul Raghuvanshi (@BostonNewsHound) November 16, 2016