దక్షిణాఫ్రికా వ్యాపార రాజధాని జోహనెస్ బర్గ్ లో గురువారం భూమి కంపించింది
జోహన్నెస్ బర్గ్ లో భూప్రకంపనలు
Aug 5 2014 7:00 PM | Updated on Sep 2 2017 11:25 AM
జోహన్నెస్ బర్గ్: దక్షిణాఫ్రికా వ్యాపార రాజధాని జోహనెస్ బర్గ్ లో గురువారం భూమి కంపించింది. భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3 గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప తీవ్రత స్వల్పంగా ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.
దక్షిణ జోహనెస్ బర్గ్ కు 180 కిలో మీటర్ల దూరంలో ఆర్క్నీ సమీపంలో భూకంపం సంభవించింది. భూప్రకంపనలు పొరుగుదేశాలైన బోట్స్వానా, మోజాంబిక్ దేశాల్లో కూడా సంభవించినట్టు సమాచారం అదింది.
Advertisement
Advertisement