సింగరేణి పరీక్షకు 70 వేల మంది హాజరు | 70 candidates appeared for Singareni exam | Sakshi
Sakshi News home page

సింగరేణి పరీక్షకు 70 వేల మంది హాజరు

Oct 12 2015 12:55 AM | Updated on Sep 2 2018 4:19 PM

సింగరేణిలో ఖాళీగా ఉన్న 471 జూనియర్ అసిస్టెంట్ (క్లరికల్) పోస్టులకు ఆరు జిల్లాల్లోని 170 కేంద్రాలలో ఆదివారం పరీక్షలు నిర్వహించారు.

కొత్తగూడెం: సింగరేణిలో ఖాళీగా ఉన్న 471 జూనియర్ అసిస్టెంట్ (క్లరికల్) పోస్టులకు ఆరు జిల్లాల్లోని 170 కేంద్రాలలో ఆదివారం పరీక్షలు నిర్వహించారు. మొత్తం 83,225 మందికి హాల్‌ టిక్కెట్లు పంపిణీ చేయగా 70,561 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో జరిగిన కార్యక్రమంలో సింగరేణి సంస్థ డెరైక్టర్ (ఫినాన్స్, పా) పవిత్రన్‌కుమార్ లాటరీ ద్వారా పరీక్ష పత్రాన్ని ఎంపిక చేశారు.

ఆదిలాబాద్‌లో 22 పరీక్ష కేంద్రాల్లో 7,915 మందికి గాను 6,271, హైదరాబాద్‌లో 6 కేంద్రాల్లో 5,277 మందికి 3,787 మంది, కరీంనగర్‌లో 53 పరీక్ష కేంద్రాల్లో 25,429 మందికి గాను 21,895 మంది, వరంగల్‌లో 21 కేంద్రాల్లో 14,576 మందికి గాను 12,366 మంది, ఖమ్మంలో 41 కేంద్రాల్లో 20,799 మందికి గాను 17,810 మంది, మంచిర్యాలలో 27 పరీక్ష కేంద్రాల్లో 9,229 మందికి గాను 8,432 మంది హాజరయ్యారు.
 

Advertisement
 
Advertisement
Advertisement