హయత్‌నగర్‌లో ఏడేళ్ల బాలుడి కిడ్నాప్ | 7 years old boy kidnaped in hayat nagar | Sakshi
Sakshi News home page

హయత్‌నగర్‌లో ఏడేళ్ల బాలుడి కిడ్నాప్

Oct 14 2015 1:05 PM | Updated on Jul 12 2019 3:02 PM

నగరంలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్య నగర్ లో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది.

హైదరాబాద్: నగరంలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్య నగర్ లో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. స్థానికంగా ఉండే నరసింహా దంపతుల కొడుకు నవీన్ (7) కుంట్లూరులో రెండో తరగతి చదువుతున్నాడు. 

 

మంగళవారం సాయంత్రం తన ఇంటి ముందు ఆడుకుంటున్న నవీన్ ను గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి అపహరించుకుపోయారు. ఎక్కడ వెతికినా లాభం లేకపోవడంతో బుధవారం ఉదయం నవీన్ తల్లిదండ్రులు హయత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement