యూఎస్లో బస్సు బోల్తా: 50 మందికి గాయాలు | 50 injured as bus overturns in US | Sakshi
Sakshi News home page

యూఎస్లో బస్సు బోల్తా: 50 మందికి గాయాలు

Aug 23 2013 8:38 AM | Updated on Sep 1 2017 10:03 PM

కాలిఫోర్నియాలోని తూర్పు లాస్ ఎంజెల్స్ లోని జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడిన ఘటనలో 50 మంది ప్రయాణీకులు గాయపడ్డారు.

కాలిఫోర్నియాలోని తూర్పు లాస్ ఎంజెల్స్ లోని జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడిన ఘటనలో 50 మంది ప్రయాణీకులు గాయపడ్డారని ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. గురువారం సంభవించిన ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కాగా తీవ్రంగా గాయాలపాలైన క్షతగాత్రులను మాత్రం అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాఫ్టర్ల ద్వారా సమీపంలోని పెద్ద ఆసుపత్రులకు తరలించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

 

అయితే ప్రయాణీకుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. ప్రమాదానికి గురైన బస్సు సన్ బెర్నాడినో నుంచి కాసినో వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ మేరకు స్థానిక మీడియా శుక్రవారం ఓ కథనాన్ని వెలువరించింది.

Advertisement
 
Advertisement
Advertisement