శిథిలాల కింద చిక్కుకున్న యువతి | 5 Dead in Delhi Building Collapse, Young Girl Feared Trapped | Sakshi
Sakshi News home page

శిథిలాల కింద చిక్కుకున్న యువతి

Jul 19 2015 5:56 PM | Updated on Aug 1 2018 2:26 PM

ఈ శిథిలాల కింద ఓ యువతి, యజమాని చిక్కుకుపోయారు.

న్యూఢిల్లీ: ఢిల్లీలో నాలుగు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 5కు పెరిగింది. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. ఈ శిథిలాల కింద ఓ యువతి, యజమాని చిక్కుకుపోయారు.

శనివారం రాత్రి పశ్చిమ విష్ణు గార్డెన్ ఏరియాలో భవనం కుప్పకూలింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి కొంత మందిని రక్షించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా శిథిలాల కింద మరికొంతమంది ఉంటారని భావిస్తున్నట్టు పశ్చిమ ఢిల్లీ డీసీపీ పుష్పేంద్ర కుమార్ చెప్పారు. ప్రమాద స్థలానికి వెళ్లే మార్గం ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement