బస్సును ఢీ కొన్న ట్రక్: 27 మంది మృతి | 27 dead in Sudan bus-truck collision: police | Sakshi
Sakshi News home page

బస్సును ఢీ కొన్న ట్రక్: 27 మంది మృతి

Jul 22 2014 8:28 AM | Updated on Sep 2 2017 10:42 AM

ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్క్ ఢీ కొన్న ఘటనలో 27 మంది మృతి చెందారు.

ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్క్ ఢీ కొన్న ఘటనలో 27 మంది మృతి చెందారు. ఆ ఘటన సూడాన్లోని కర్తోమ్ పట్టణంలో చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఏడుగురు మహిళలతోపాటు ఓ చిన్నారి ఉందని పోలీసులు వెల్లడించారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement