ఆయుధగారంలో పేలుళ్లు : ఐఎస్ తీవ్రవాదులు హతం | 25 IS militants killed in Syria weapon depot blast | Sakshi
Sakshi News home page

ఆయుధగారంలో పేలుళ్లు : ఐఎస్ తీవ్రవాదులు హతం

Apr 30 2015 8:35 AM | Updated on Apr 3 2019 3:52 PM

సిరియా రాజధాని డెమాస్కస్లో ఇస్లామిక్ మిలిటెంట్స్ గ్రూప్నకు చెందిన ఆయుధగారంలో బుధవారం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది.

డెమాస్కస్: సిరియా రాజధాని డెమాస్కస్లో ఇస్లామిక్ మిలిటెంట్స్ గ్రూప్నకు చెందిన ఆయుధగారంలో బుధవారం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 25 మంది ఇస్లామిక్ తీవ్రవాదులు మరణించారు. మరో 20 మందికి పైగా మరణించారు. ఈ మేరకు సిరియాలోని బ్రిటన్కు చెందిన మానవహక్కుల పరిశీలకులు గురువారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించారు. అయితే క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ పేలుడుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదని పేర్కొన్నారు.  డెమాస్కస్లోని పశ్చిమ భాగంలోని డెయిర్ అల్ జోర్ ప్రావెన్స్లో బాంబు పేలుళ్లు నిత్యకృత్యం అని మానవహక్కుల పరిశీలకులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement