25వేలకే తులం బంగారం ఇస్తానంటూ..! | 10grams gold for 25000 | Sakshi
Sakshi News home page

25వేలకే తులం బంగారం ఇస్తానంటూ..!

Nov 12 2016 8:32 PM | Updated on Sep 4 2017 7:55 PM

ఆయన పేరు దొరబాబు. నిజాంపేటలో అశోకా జెమ్స్‌ అండు జువెల్లరీ పేరిట ఓ బంగారు అభరణాల దుకాణాన్ని నిర్వహిస్తున్న దొరబాబు

హైదరాబాద్:  ఆయన పేరు దొరబాబు. నిజాంపేటలో అశోకా జెమ్స్‌ అండు జువెల్లరీ పేరిట ఓ బంగారు అభరణాల దుకాణాన్ని నిర్వహిస్తున్న దొరబాబు గతంలో మహిళలకు బంపర్ ఆఫర్‌ ఇచ్చాడు. కస్టమ్స్‌ అధికారులు చాలామంది తనకు తెలుసునని, వారి ద్వారా కేవలం రూ. 25వేలకు తులం బంగారం ఇప్పిస్తానని మహిళల్ని నమ్మించాడు.

దీంతో 20 మహిళలు అతనికి ఏకంగా రూ. 80 లక్షల వరకు చెల్లించారు. ఇదిగో బంగారం అదిగో బంగారం అంటూ ఊరించిన దొరబాబు చెప్పాపెట్టకుండా మాయమయ్యాడు. అతడు ఎంతకూ కనిపించకపోవడంతో మోసపోయామని గుర్తించిన మహిళలు పోలీసులను ఆశ్రయించారు. నిజాంపేట్‌లో రూ.25వేలకే తులం బంగారం పేరిట మహిళల్ని మోసం చేసిన దొరబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement