ఘనంగా వైస్సార్‌ జయంతి | YSRCP Leaders Celebrate YSR Jayanthi Adilabad | Sakshi
Sakshi News home page

ఘనంగా వైస్సార్‌ జయంతి

Jul 9 2018 12:31 PM | Updated on Aug 17 2018 2:56 PM

YSRCP Leaders Celebrate YSR Jayanthi Adilabad - Sakshi

ఖానాపూర్‌: వైఎస్సార్‌కు నివాళులర్పిస్తున్న నాయకులు

ఖానాపూర్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఆదివారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. వైఎస్సార్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ ఆశయ సా«ధనకు, వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, మైనార్టీ సెల్‌ పట్టణ అధ్యక్షుడు రయిస్‌ బేగ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు యోగేశ్, పార్టీ జిల్లా కార్యదర్శి షేక్‌ అజ్గర్, నాయకులు జహీర్, నిఖిల్, శ్రీకాంత్, రిష్‌ తదితరులున్నారు.
 
కడెంలో..
కడెం(ఖానాపూర్‌): దివంగత సీఎం వైఎస్సార్‌ జయంతిని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తూరి పురుషోత్తం వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా మహానేత సీఎంగా రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
 
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో..
వైఎస్సార్‌ జయంతిని మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు కొమురయ్య, వైఎస్సార్‌ అభిమాని దుల్లె వెంకటేశ్‌ కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచారు. సీఎంగా వైఎస్సార్‌ చేసిన సేవలను కొనియాడారు. నాయకులు మునీర్, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

1
1/1

కడెం: స్వీట్లు పంచుతున్న కాంగ్రెస్‌ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement