చలో విజయవాడ! | YS Jagan Fans Tour to Vijayawada For Oath | Sakshi
Sakshi News home page

చలో విజయవాడ!

May 29 2019 7:45 AM | Updated on May 29 2019 8:33 AM

YS Jagan Fans Tour to Vijayawada For Oath - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అభినందించేందుకు నగరం నుంచి భారీ ఎత్తున అభిమానులు తరలివెళ్లనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఉత్సవాన్ని కళ్లారా చూసి తీరాల్సిందేనన్న పట్టుదలతో పలువురు తెలంగాణ నాయకులు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. మరికొందరు అభిమానులు మాత్రం సొంత ఏర్పాట్లతోనే విజయవాడ గడప తొక్కనున్నారు.

వైఎస్సార్‌సీపీ విజయాన్ని ఇప్పటికే భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, ర్యాలీలతో స్వాగతించిన అభిమానులు.. ఇక ఆయన ప్రమాణ స్వీకారం చూస్తే మరో ఘట్టం కూడా పూర్తి చేసినవారవుతారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ యువజన విభాగం తెలంగాణ అధ్యక్షులు వెల్లాల రాంమోహన్‌ పేర్కొన్నారు. ఇక వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చూసేందుకు దశాబ్దకాలంగా వేచి చూస్తున్నాని, గురువారం జరిగే కీలక ఘట్టంలో తాను సైతం పాల్గొని ఆయన్ను అభినందిస్తానని వైఎస్సార్‌ అభిమాని పడాల శ్రీకాంత్‌  చెప్పారు. ఇదిలా ఉంటే పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులు సైతం సెలువు పెట్టి విజయవాడలో జరిగే జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకార ఉత్సవంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement