ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం కలమడుగు వద్ద గోదావరిలో పుష్కర స్నానం చేస్తూ ఒక యువకుడు గల్లంతయ్యాడు.
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం కలమడుగు వద్ద గోదావరిలో పుష్కర స్నానం చేస్తూ ఒక యువకుడు గల్లంతయ్యాడు. శనివారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కరీంనగర్ జిల్లా మల్యాలకు చెందిన కార్తీక్ కుటుంబసభ్యులతో కలసి కలమడుగు సమీపంలోని అత్తమడుగు అనే ప్రాంతంలో గోదావరిలోకి దిగారు. స్నానం చేసిన అనంతరం కార్తీక్, బంధువు శ్రవణ్‌తో కలసి బయటకు వస్తుండగా కాలు జారి లోతు ఎక్కువ ఉన్న చోట నీటిలో పడిపోయారు. చుట్టుపక్కల వారు శ్రవణ్‌ను కాపాడగలిగారు. కార్తీక్ జాడ మాత్రం తెలియలేదు. ఈతగాళ్లు అతని కోసం గాలిస్తున్నారు.