డివైడర్ను ఢీకొన్న బైక్ : యువకుడి మృతి | youth dies in bike accident at sircilla | Sakshi
Sakshi News home page

డివైడర్ను ఢీకొన్న బైక్ : యువకుడి మృతి

Apr 3 2016 5:56 PM | Updated on Sep 18 2019 3:24 PM

కరీంనగర్ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

సిరిసిల్ల : కరీంనగర్ జిల్లాలో ఆదివారం జరిగిన  రోడ్డుప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సిరిసిల్ల పట్టణంలో శంకర్(35) అనే యువకుడు తన స్నేహితుడు రాజుతో కలసి బైక్ పై అతి వేగంగా వెళ్తూ డివైడర్ ఢీ కొట్టారు.

దీంతో శంకర్ అక్కడిక్కడే మృతి చెందగా రాజుకు తీవ్రగాయాలు కావడంతో సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. హెల్మెట్ ధరించినా ప్రాణాలు దక్కిండేవని స్థానికులు చెప్పుతున్నారు. వీరిద్దరూ ఎల్లారెడ్డిపల్లికి చెందిన వారీగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement