
యువకుడి దారుణ హత్య
గుర్తుతెలియని దుండగులు ఒక యువకుడిని బండతో తలపై కొట్టి దారుణంగా హత్యచేశారు. ఈ సంఘటన గురవారం ఉదయం నిజామాబాద్ నగరంలోని సాయినగర్ కాలనీలో వెలుగు చూసింది.
నిజామాబాద్ : గుర్తుతెలియని దుండగులు ఒక యువకుడిని బండతో తలపై కొట్టి దారుణంగా హత్యచేశారు. ఈ సంఘటన గురవారం ఉదయం నిజామాబాద్ నగరంలోని సాయినగర్ కాలనీలో వెలుగు చూసింది. వివరాలు.. కాలనీలో ఒక యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలు, యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.