కూటమి విజయం ఖాయం

Would Come To Power In Karnataka Irrigation Minister DK Shivakumar Said Prajakutami - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో హంగ్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం లేదని, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని కర్ణాటక సాగునీటి మంత్రి డి.కె.శివకుమార్‌ వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన గాంధీభవన్‌లో ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌ పదవిని, అధికారయంత్రాంగాన్ని వాడుకుని గెలవాలని చూస్తున్నారని, కానీ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. తాను సాధారణ కార్యకర్తను మాత్రమేనని, తనతో పాటు పార్టీ శ్రేణులను కలుపుకుని తెలంగాణలో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు.

కూటమి ప్రభుత్వంలో టీడీపీ పాత్రపై ప్రశ్నించగా అది రాహుల్‌ గాంధీ, చంద్రబాబులు కలిసి నిర్ణయిస్తారన్నారు. కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరనేది పార్టీ హైకమాండ్‌ నిర్ణయిస్తుందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top