ఇస్తే రెండు చీరలివ్వండి.. లేకపోతే వద్దు !

Womens Reject Bathukamma Sarees in Sangareddy - Sakshi

సాక్షి, సంగారెడ్డి : బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం ఇచ్చే చీరలను శనివారం మహిళలు తిరస్కరించారు. మాకు గతేడాది చీరలు ఇవ్వలేదనీ, ఈ ఏడాదీ మాకు చీరలివ్వవద్దంటూ పట్టుబట్టారు. ఇవ్వదల్చుకుంటే గతేడాది, ఈ ఏడాదికి కలిపి రెండు చీరలు ఇవ్వాలని లేకపోతే వద్దని ఆ మహిళలు డిమాండ్‌ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్‌ మండలం గొంగుళూర్‌, చౌటకూర్‌ గ్రామాల్లో జరిగిందీ సంఘటన. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లో అధికారులు, మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. గతేడాది ఎన్నికల కారణంగా చీరలు ఇవ్వలేకపోయామని అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top