breaking news
Saree distribution
-
మహిళలు తలెత్తుకునేలా తెలంగాణ సారె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళలు ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా ‘తెలంగాణ సారె’కార్యక్రమాన్ని తలపెట్టామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘ప్రజా ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. వారి కోసం పలు కార్యక్రమాలు చేపడుతోంది. అవకాశం ఉన్న చోటల్లా ప్రోత్సహిస్తోంది. ఆడబిడ్డలకు పుట్టింటి వాళ్లు, అన్నదమ్ములు సారె, చీర పెట్టడం సంప్రదాయం. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డను తోబుట్టువుగా భావించి ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి మహిళకు చీర అందిస్తోంది..’అని చెప్పారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతిని పురస్కరించుకుని బుధవారం నెక్లెస్ రోడ్డులోని ఆమె విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు, స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీలు) ప్రతినిధులనుద్దేశించి రేవంత్ మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమానంతరం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల్లోని ఎస్ హెచ్‌జీల సభ్యులతోనూ ఆయన మాట్లాడారు ఇందిర స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం పాలన ‘ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ భారత్ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. భారత్‌కు బలమైన నాయకత్వాన్ని అందించారు. ఆమె స్పూర్తితోనే రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోంది. 2034 నాటికి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తోంది. 1,000 బస్సులకు వారిని యజమానులుగా చేశాం. సౌర విద్యుత్ ప్రాజెక్టులు పెట్టించాం. పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించాం. వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. రాయితీపై సిలిండర్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద వైఎస్సార్ హయాంలో 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తే..ప్రస్తుత ప్రజా ప్రభుత్వం 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేసి ఒక్కో ఇంటికి రూ.5 లక్షల మేర ఆర్థికసాయం అందిస్తోంది. యూనిఫాంలు కుట్టే బాధ్యతను అప్పజెప్పడంతో మహిళా సంఘాలకు రూ.30 కోట్ల ఆదాయం సమకూరింది. ధాన్యం కొనుగోళ్లు మహిళా సంఘాలకే అప్పజెప్పాం. తాజాగా ‘తెలంగాణ సారె’పేరిట రెండు విడతల్లో కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నాం..’అని సీఎం చెప్పారు. ప్రతి మహిళకు చీర అందాలి ‘తెలంగాణ సారె’కోసం ఆర్నెల్ల క్రితం చీరలు ఆర్డర్ చేస్తే.. ఇప్పటివరకు 65 లక్షల చీరలు మాత్రమే అందాయి. అందువల్ల తొలి విడత కింద డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ చీరలు పంపిణీ చేస్తాం. మిగతా 35 లక్షల చీరలు రెండో విడతలో మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ పరిధిలో పంపిణీ చేస్తాం. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో మహిళలకు ఎన్నో రకాల ఆశలు పెట్టి అడియాసలు చేశారు. కానీ ప్రజా ప్రభుత్వం ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తోంది. చీరల పంపిణీ బాధ్యత మంత్రి సీతక్కకు అప్పగిస్తున్నా. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ జరిపి ప్రతి మహిళకు చీర అందేలా చర్యలు తీసుకోవాలి. అంతా ఈ చీరలు ధరించాలి.. మంత్రులు, ఎమ్మెల్యేల సతీమణులకు కూడా చీరలు పంపిణీ చేయాలి. అయితే వాటికి మాత్రం బిల్లులు తీసుకోవాలి. రాష్ట్రంలోని మహిళా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారిణులు కూడా ఈ చీరలు ధరించాలి. బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి. ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి.. ఆ చీరలతో ఫోటోలు దిగి వాటిని అప్లోడ్ చేసే వీలు కల్పించాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. పండుగ వాతావరణంలో నిర్వహించాలి ఎస్‌హెచ్‌జీల సభ్యులతో మాట్లాడుతున్న సందర్భంగా..మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వివిధ రకాల వస్తువులను ఈ–కామర్స్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు అమెజాన్‌తో అధికారులు సంప్రదింపులు జరపాలని రేవంత్ ఆదేశించారు. ‘చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి కలెక్టర్లు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. ‘మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి’పేరిట చీరల పంపిణీ కార్యక్రమాలను చేపట్టాలి. ప్రతి మండల కేంద్రంలో కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలి. చీర అందించే సమయంలో ఆధార్ నంబర్ తీసుకోవాలి. ముఖ గుర్తింపు చేపట్టాలి..’అని ముఖ్యమంత్రి సూచించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ మహిళల గౌరవం పెంచాలనే ఉద్దేశంతోనే ప్రజా ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతోందన్నారు. రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ చీరలు అందిస్తున్నామని తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళా సంఘాల ఆర్థిక క్రమశిక్షణతో బ్యాంక్‌లు రుణాలు ఇచ్చేందుకు సంఘాల దగ్గరకే వస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఐదు జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్లకు సీఎం చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, కార్యదర్శి మాణిక్ రాజ్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు. మీ పెట్రోల్ బంక్ ఎలా నడుస్తోంది... వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఎస్‌హెచ్‌జీ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్ ఎలా నడుస్తోందని నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతిని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ‘బాగా నడుస్తోందని, నెలకు రూ.4 లక్షల రాబడి ఉందని ఆమె తెలిపారు. ఇతర జిల్లాల నుంచి సంఘాలను అక్కడకు తీసుకెళ్లి వారి పని తీరు.. రాబడిని ప్రత్యక్షంగా చూపాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. చీరల డిజైన్లు బాగున్నాయి తమకు ఇస్తున్న చీరల డిజైన్లు ఎంతో బాగున్నాయంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 9 మీటర్లు, 6 మీటర్ల చీరలు తమకు నచ్చాయని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి చీరలు ఇవ్వడంతో తమకు యూనిఫాం వచి్చందనే సంతోషం కలుగుతోందని కుమ్రుంభీం ఆసిఫాబాద్ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు. -
కోక లేకుండానే పండుగా ?!
ఖమ్మంమయూరిసెంటర్: ‘అక్కాచెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ పేరుతో స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బతుకమ్మ పండుగ నాటికి సభ్యులకు రెండేసి చీరలు ఇస్తామని ప్రకటించారు. అయితే, బతుకమ్మ పండుగ రెండు రోజులు గడిచినా జిల్లాకు పూర్తి స్థాయిలో చీరలే చేరకపోగా.. పంపిణీపై యంత్రాంగం అయోమయంలో పడిపోయింది. కనీసం ఒక్కో చీర ఇవ్వాలని భావించినా ఆ స్థాయిలో స్టాక్ రాకపోవడం.. కొందరికే ఇస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియక పెండింగ్ పెట్టినట్లు తెలుస్తోంది.స్టాక్ పాయింట్లకు 1.80 లక్షల చీరలుమహిళా సంఘాల సభ్యులకు అందించే చీరలను జిల్లాలకు సరఫరా చేసింది. జిల్లాలో 3,35,879 మంది సభ్యులకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయింయగా.. సెర్ప్, మెప్మా పరిధిలోని సంఘాల సభ్యులను గుర్తించారు. ఒక్కో సభ్యురాలికి రెండేసి చీరలు పంపిణీ చేసేందుకు మొత్తం 6,71,758 చీరలు అవసరమవుతాయి. మొదటి విడతలో 3,35,879 చీరలు సరఫరా చేస్తామని ప్రకటించినా అందులో 1,80,779 చీరలే వచ్చా యి. దీంతో చీరలను సెర్ప్ అధికారులు గోదాంల్లో భద్రపరిచారు. ఇక మెప్మాకు సంబంధించి సంఘాల్లోని సభ్యులకు సరఫరా చేసేందుకు ఒక్క చీర కూడా జిల్లాకు చేరలేదు.ఒక చీర ఇవ్వాలన్నా..గతేడాది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించినట్లుగా ఈ ఏడాది బతుకమ్మ పండుగ నాటికి మహిళ సభ్యులకు చీరలు అందుతాయని అంతా భావించారు. ఈనెల 5వ తేదీ నుంచే ప్రభుత్వం జిల్లాలకు చీరల సరఫరాను ప్రారంభించింది. ఈ నెల 9వ తేదీ నాటికి 1.80 లక్షల చీరలే రాగా.. మిగిలిన చీరలు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. బతుకమ్మ వేడుకల మొదటి రోజే ఒక్కో చీర అయినా పంపిణీ చేస్తారని భావించినా అలా జరగలేదు. జిల్లాలోని సభ్యులకు ఒక్కో చీర పంపిణీ చేయాలన్నా ఇంకా 1,55,100 చీరలు అవసరం కావడం.. అవి ఎప్పుడు వస్తాయో తెలియక అధికారులు ఉన్నత స్థాయి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. -
కూతురు పుట్టిందని.. సెల్ఫోన్లు పంచిపెట్టారు!
సారంగాపూర్: కూతురు పుట్టడంతో.. మహాలక్ష్మి పుట్టిందని ఆ దంపతులు సంబరపడ్డారు. తమ సంతోషాన్ని పదిమందితో పంచుకోవాలని సంకల్పించారు. ఈ మేరకు వారు సోమవారం గ్రామంలోని 25 మంది ఆటో డ్రైవర్లకు రూ.3.5 లక్షల విలువ చేసే సెల్ఫోన్లు బహూకరించారు. మరో 1,500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. దీనికి జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ వేదికగా మారింది. గ్రామానికి చెందిన ఓగుల అజయ్, అనీల దంపతులకు 18 రోజుల క్రితం కూతురు జన్మించింది. దీంతో తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంబరపడ్డారు. ఆ సంతోషంతో గ్రామంలోని ప్రతి ఆడబిడ్డకు (1,500 మంది మహిళలకు) ఇటీవల చీరలు పంపిణీ చేశారు. తాజాగా ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కటి రూ.14 వేల విలువైన సెల్‌ఫోన్ అందజేశారు.అజయ్ పెళ్లికి ముందు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు రూ.30 కోట్ల ప్రైజ్‌మనీ వచ్చింది. తరువాత స్వదేశానికి వచ్చిన ఆయన.. శ్రీకృష్ణ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి పేద విద్యార్థుల చదువుకు.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు.. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, ఆలయాల నిర్మాణాలకు వెచ్చిస్తున్నారు. చదవండి: ఒక్కరే టీచర్.. ఇద్దరు విద్యార్థులు -
పచ్చ నేతల ప్రలోభ పర్వం
హిందూపురం అర్బన్/చిలమత్తూరు: ఎన్నికలు సమీపిస్తున్న వేళ హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు ప్రలోభాలకు తెరతీశారు. స్థానిక నేతల ద్వారా చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారు. క్లస్టర్, బూత్ లెవెల్ కన్వీనర్ల కనుసన్నల్లో ఈ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. అయితే, చాలాచోట్ల ప్రజల నుంచి వారికి చుక్కెదురవుతోంది. చిలమత్తూరు మండలంలోని అప్పనపల్లిలో శనివారం రాత్రి టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి చీరలు పంపిణీ చేస్తుండగా... సుధాకర్ అనే రైతు వారికి చీవాట్లు పెట్టాడు. ‘ఏమి చేశారని మాకు చీరలు ఇచ్చేందుకు వస్తున్నారు? ఏదైనా మంచి చేసి అప్పుడు పంపిణీ చేయండి. ఎన్నికలు వస్తేనే చీరలు పంచుతారా?! ఇదొక్కటి చేస్తే ఓట్లు పడవు. మంచి చేసిన వారికే ప్రజలు ఓట్లు వేస్తారు. మీలాంటి వాళ్లకు కాదు’ అని ఆయన చురకలు అంటించారు. దీంతో వారు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. రాత్రికి రాత్రే పంపిణీ హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు రాత్రిపూట చీరల పంపిణీ చేపడుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే చీరలు పంచేందుకు ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడే మొదలుపెట్టారు. ఈసారి మహిళా ఓట్లు పడవని నిర్ధారణకు వచ్చారో ఏమో తెలియదు కానీ హిందూపురం రూరల్, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో క్లస్టర్, బూత్ కనీ్వనర్ల కనుసన్నల్లో మహిళా ఓటర్లకు చీరల పంపిణీ కొనసాగుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా 2,46,463 మంది ఓటర్లు ఉండగా.. అందులో మహిళా ఓటర్లు 1,22,471 మంది ఉన్నారు. ఇందులో లక్ష మందికైనా చీరలు పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే బాలకృష్ణ ఫొటోతో ఉన్న బ్యాగులో చీరలు ఉంచి మహిళలకు అందిస్తున్నారు. నాలుగు రోజులుగా ఈ పంపిణీ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే లేపాక్షి మండలంలోని తిలక్ నగర్, నాయనపల్లి, లేపాక్షి, కంచిసముద్రం, చోళసముద్రం, హిందూపురం రూరల్ మండలంలోని బేవనహళ్లి, చౌళూరు, మనేసముద్రం, చిలమత్తూరు మండలంలో సోమఘట్ట, చాగలేరు, కోడూరు, చిలమత్తూరు, దేమకేతేపల్లిలో పంపిణీ పూర్తి చేశారు. టేకులోడు, తుమ్మలకుంట, వీరాపురంలో రెండు రోజుల్లో పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈసారి నందమూరివారి కంచుకోట బద్ధలవ్వడం ఖాయమని నిర్ధారణకు వచ్చిన బాలకృష్ణ పీఏలు ఈ సమాచారాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో తప్పనిసరి పరిస్థితులలో చీరలు పంపిణీ చేసి మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నాఫలించవని ప్రజలు అంటున్నారు. -
బతుకమ్మ చీరలు రెడీ.. నేటి నుంచి గ్రామాల్లో పంపిణీ
కరీంనగర్‌రూరల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగా ఏటా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తోంది. 2017 నుంచి ఆహార భద్రత కార్డు కలిగి ఉండి, 18 ఏళ్లు దాటిన మహిళలకు అందిస్తున్న చీరలను ఈనెల 4 నుంచి 14వ తేదీ వరకు పంపిణి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈఏడాది జిల్లావ్యాప్తంగా 3,53,707 చీరలు అవసరం కాగా ఇప్పటివరకు 2.79 లక్షల చీరలు వచ్చాయి. ఇంకా 74,707 చీరలు రావాల్సి ఉన్నాయి. మంగళవారం జిల్లాలోని గోదాముల నుంచి చీరల స్టాక్‌ను పంచాయతీ అధికారులకు అప్పగించారు. బుధవారం నుంచి జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్లో చీరలు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, రేషన్‌డీలరు, స్వశక్తి సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు పంపిణీ చేయనున్నారు. -
ఉచిత చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురి మృతి!
చెన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఉచిత చీరల కోసం వెళ్లిన నలుగురు మహిళలు మృత్యువాతపడ్డారు. తిరువత్తూరులో జిల్లా వాణియంబాడిలోని జిన్నాపాలెం వద్ద మురుగన్ తైపుసం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేటు సంస్థ మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. చీరల కోసం ఉచిత టోకెన్లు పొందేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 2000 మంది మహిళలు తరలివచ్చారు. అయితే టోకెన్ల కోసం మహిళలు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఊపిరాడక 16 మంది మహిళలు స్పృహతప్పి పడిపోయారు.వీరిని వెంటనే వాణియంబాడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురు మహిళలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయలపాలైన మరో 12 మంది మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై ఎస్పీ బాలకృష్ణ విచారణకు ఆదేశించారు. టోకెన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసిన ప్రైవేట్ సంస్థ యజమాని అయ్యప్పన్‌ను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: పెండింగ్ చలాన్లపై 50శాతం డిస్కౌంట్.. ఒక్కరోజే రూ.5.6 కోట్లు వసూలు.. -
పయ్యావుల అనుచరుల దౌర్జన్యకాండ
సాక్షి, ఉరవకొండ : కౌకుంట్ల పంచాయతీ విభజనను జీర్ణించుకోలేని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఆయన సోదరుడు పయ్యావుల శ్రీనివాసులు తమ అనుచరుల ద్వారా కౌకుంట్ల పంచాయతీలో దౌర్జన్యకాండ సాగిస్తున్నారు. వారం రోజుల క్రితం వడ్డే వెంకటేష్, గంగమ్మ కుటుంబంపై దాడి ఘటన మరకముందే మైలారంపల్లిలో తాము పంచే చీరలు తీసుకొనందుకు దంపతులపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. బాధితులు అల్లాబకష్, ఇమాంబీ కథనం మేరకు.. పది రోజుల క్రితం జరిగిన పంచాయతీ విభజన గ్రామసభలో ప్రజలను ప్రలోభ పెట్టడానికి పెద్దఎత్తున పంపిణీ చేయడానికి చీరలు తీసుకొచ్చారు. అయితే కొన్ని గ్రామాల్లో చీరల పంపిణీ వాయిదా పడటంతో వాటిని మంగళవారం రాత్రి పంపణీ చేశారు. అయితే అల్లాబకష్ దంపతులు వాటిని తీసుకోవడానికి అంగీకరించలేదు. దీన్ని జీర్ణించుకోలేని పయ్యావుల ప్రధాన అనుచరులు వెంకటరమణప్ప, సాయిరాజు, ప్రణయ్, శ్రీకాంత్‌తో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు. ఇమాంబి చీర, జాకెటు చింపి ఆమెను తీవ్రంగా అవమానపరిచారు. గ్రామస్తులు బాధితులను హుటాహుటినా ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ ధరణిబాబు తెలిపారు. వారి దౌర్జన్యకాండను ఇక సహించం పయ్యావుల కేశవ్ ఆయన సోదరుడు పయ్యావు ల శ్రీనివాసుల దౌర్జన్యకాండను ఇక సహించ బోమని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వై.మధు సూధన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. చిన్నకౌకుంట్ల, విడపనకల్లు మండలం కరకముక్కల, పాల్తూరు గ్రామాల్లో పయ్యావుల అనుచరులు వైఎస్సార్సీపీ నాయకులే టార్గెట్‌గా దాడులు చేశారన్నారు. గ్రామాల్లో తమ అధిపత్యం చెలాయించడం కోసం వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే తాము చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. -
ఇస్తే రెండు చీరలివ్వండి.. లేకపోతే వద్దు !
సాక్షి, సంగారెడ్డి : బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం ఇచ్చే చీరలను శనివారం మహిళలు తిరస్కరించారు. మాకు గతేడాది చీరలు ఇవ్వలేదనీ, ఈ ఏడాదీ మాకు చీరలివ్వవద్దంటూ పట్టుబట్టారు. ఇవ్వదల్చుకుంటే గతేడాది, ఈ ఏడాదికి కలిపి రెండు చీరలు ఇవ్వాలని లేకపోతే వద్దని ఆ మహిళలు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ మండలం గొంగుళూర్, చౌటకూర్ గ్రామాల్లో జరిగిందీ సంఘటన. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లో అధికారులు, మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. గతేడాది ఎన్నికల కారణంగా చీరలు ఇవ్వలేకపోయామని అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. -
టీడీపీ నేతల దౌర్జన్యంపై ఆగ్రహం
సాక్షి, సీఎస్‌పురం (ప్రకాశం): మండల కేంద్రం సీఎస్‌పురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ తోబుట్టువుకు పుట్టింటి కానుకగా మండలంలోని మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలుగు రోజులుగా సీఎస్‌పురం పంచాయతీలోని గ్రామాల్లో చీరలు పంపిణీ చేస్తున్నారు. సీఎస్‌పురంలోని ఏనిమిట్ట వీధిలో చీరలు పంపిణీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బొబ్బూరి రమేష్ శుక్రవారం రాత్రి దౌర్జన్యం చేసి చీరల పంపిణీని అడ్డుకున్నాడు. యువకులను బూతులు తిట్టడమేగాక అక్కడే ఉన్న మాజీ ఎంపీపీ భువనగిరి వెంకటయ్య పట్ల దురుసుగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి వెంకటయ్యపై టీడీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించారని ప్రచారం సాగడంతో మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శనివారం ఉదయం సీఎస్‌పురం చేరారు. సీఎస్‌పురం, పామూరు ఎస్ఐలు శివనాంచారయ్య, రాజ్‌కుమార్‌లు అప్రమత్తమై గుమిగూడిన ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. ఇరుపార్టీల నాయకులను పోలీసుస్టేషన్‌కు పిలిపించి చర్చలు జరిపారు. భువనగిరి వెంకటయ్యకు బొబ్బూరి రమేష్ క్షమాపణ చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. -
ఓటర్లకు జేసీ బ్రదర్స్ చీరలు, శాలువాలు
మిగిలింది మూడు నెలలు. ఇప్పటి వరకు ఓటర్ల బాగోగులు పట్టించుకోని నేతలకు ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చింది. ఎన్నికలు వచ్చేసరికి.. ఎలాగైనా ఓట్లు రాబట్టుకునే క్రమంలో అధినేత చంద్రబాబును అనుకరిస్తూ ప్రలోభాలకు తెరతీశారు. అవినీతి ఆరోపణలు.. వర్గ విభేదాలు.. ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. చీరలు.. శాలువాలు.. హాట్‌బాక్స్‌ల పంపిణీతో ఓటర్లకు వల వేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో డ్రైవింగ్ లైసెన్స్‌లు తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ దిగజారుడు రాజకీయం చేస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: జేసీ బ్రదర్స్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇన్నాళ్లు వెంట నడిచిన ద్వితీయ శ్రేణి ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా జారిపోతుండటంతో నియోజకవర్గంలో క్రమంగా పట్టు కోల్పోతున్నారు. వరుస పరిణామాలు ఓటమి దిశగా తీసుకెళ్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ప్రలోభాలకు తెర తీస్తున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియమించిన తర్వాత పార్టీ బలోపేతమైంది. ఇక వచ్చే ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు తప్పవనే నిర్ధారణతో ఓటర్లను ఎలాగైనా బుట్టలో వేసుకోవాలనే దిగజారుడు రాజకీయాలకు జేసీ బ్రదర్స్ తెర తీశారు. జేసీ సోదరులు, వారి పిల్లలు ఎదగడం మినహా.. వాళ్ల వెంట నడిస్తే ఒరిగేదేమీ లేదని తెలుసుకున్న పార్టీ శ్రేణుల్లో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జేసీ సోదరులు నాయకులను వదిలేసి.. ఓటర్లకు ఓల వేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే చీరలు.. శాలువాలు.. హాట్‌బాక్స్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, యాడికితో పాటు తాడిపత్రిలో చీరలు పంపిణీ చేశారు. సూరత్ నుంచి నాసిరకమైన చీరలు తెప్పించి ఓటర్ల చేతుల్లో పెడుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పంపిణీ కష్టంగా ఉంటుందని గ్రహించి, జేసీ ప్రభాకర్‌రెడ్డి, తనయుడు అస్మిత్‌రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ‘స్పర్శ’ స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. సూరత్ నుంచి లారీలతో తెప్పించినా చాలాచోట్ల చీరలు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపని పరిస్థితి. కేవలం ఎన్నికల కోసం వీరు ఇదంతా చేస్తున్నారని, చీరలకు కక్కుర్తి పడేవారు లేరని మహిళలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. పింఛన్ల పంపిణీ సమయంలో శాలువాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి హాట్‌బాక్స్‌లు ఇచ్చారు. ఇలా ధనబలంతో ప్రతి వర్గాన్నీ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ మేళాలో మరో ప్రలోభం: రాయదుర్గంలో మంత్రి కాలవ శ్రీనివాసులు ఈ నెల 21 నుంచి ‘డ్రైవింగ్ లైసెన్స్ మేళా’ నిర్వహిస్తున్నారు. 27వరకూ కొనసాగుతుంది. లైసెన్స్‌ల జారీ అనేది ఆర్టీఓ కార్యాలయాల్లో నిత్యం నడిచే తంతు! అయితే లైసెన్స్‌లు తాము ఇప్పించి ప్రజలకు మేలు చేస్తున్నామనే భావనతో అధికారులను రప్పించి, మీసేవ సెంటర్ ఏర్పాటు చేసి మంత్రి ఫొటోతో బ్యానర్ ఏర్పాటు చేసి కార్యక్రమం నడిపిస్తున్నారు. ఎల్‌ఎల్‌ఆర్‌కు రూ.310, ఫోర్‌వీలర్‌కు రూ.460 చొప్పున లైసెన్స్ కావాల్సిన వాళ్లు చెల్లిస్తున్నారు. పోనీ ఇదైనా ప్రజాప్రతినిధి చెల్లించి ఉచితంగా లైసెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అదీ లేదు. ఎవరిడబ్బులు వారు చెల్లించి లైసెన్స్ తీసుకునే కార్యక్రమాన్ని కూడా వారి ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి తనయుడు మారుతి ఏకంగా టీడీపీ కార్యాలయంలో మేళాను ఏర్పాటు చేశారు. ఉరవకొండలో కూడా మండలి చీఫ్‌విప్ పయ్యావుల కేశవ్ మేళా నిర్వహించారు. తాడిపత్రిలోనూ జేసీ బ్రదర్స్ ‘లైసెన్స్ మేళా’ పూర్తి చేశారు. కనీసం అధికారులు కూడా మేళాను టీడీపీ కార్యాలయాలు, స్థానిక ప్రజాప్రతినిధుల ఫొటోలతో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేసి నిర్వహించకూడదని మరిచి టీడీపీ దారిలోనే నడుస్తున్నారు. పుట్టపర్తి, పెనుకొండ, ధర్మవరం నియోజకవర్గాల్లో చీఫ్‌విప్ పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, వరదాపురం సూరి ఏకంగా డబ్బులు అసంతృప్త నేతలు, కార్యకర్తలతో పాటు గ్రామాల్లో పది ఓట్లు ప్రభావితం చేయగలరనే వ్యక్తులను డబ్బుతో కొనే ప్రయత్నం చేస్తున్నారు. నాలగున్నరేళ్లలో రూ.కోట్ల రూపాయాలు అక్రమంగా అర్జించి ఎన్నికల ముందు ఓటర్లకు చిల్లర విదిల్చి ప్రలోభాలకు గురిచేసి ఓట్లు దండుకునే చర్యలకు అవలభించారు. మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూలు వెలువడనుండటంతో ఆలోపే ఇలాంటి కార్యక్రమాలు ముగించేలా వ్యవహరిస్తున్నారు. అయితే టీడీపీ నేతలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు వాళ్లని నమ్మే పరిస్థితి లేదని, జిల్లాలో టీడీపీకి ఘోర పరాభావం తప్పదని విపక్షపార్టీ నేతలు విమర్శిస్తున్నారు. జేసీ బ్రదర్స్పతనంతో ప్రలోభాలు 1. పాత టీడీపీ నేతలైన కాకర్ల రంగనాథ్, గుత్తా వెంకటనాయుడు, జగదీశ్వరరెడ్డి, జయచంద్రారెడ్డి, ఫయాజ్‌బాషాలు జేసీ బ్రదర్స్‌పై వ్యతిరేకతతో పార్టీకి దూరమయ్యారు. 2. ప్రభోదానంద ఆశ్రమం ఘటనలో వేలు పెట్టారు. నియోజకవర్గానికి సంబంధించిన భక్తులే ఇక్కడ 15వేల మంది ఉన్నారు. వీరంతా జేసీ బ్రదర్స్‌ను వ్యతిరేకిస్తున్నారు. 3. ఇన్నాళ్లూ జేసీతో నడిచి, అత్యంత కీలకంగా వ్యవహరించే భోగాతి నారాయణరెడ్డి జేసీ బ్రదర్స్‌తో విభేదించారు. ఇక కలిసే ప్రసక్తే లేదని మధ్యవర్తులకు తేల్చి చెప్పారు. ఇక లాభం లేదనుకొని నాయకులను వదిలేసి ఓటర్లకు వల వేయడం ప్రారంభించింది జేసీ కుటుంబం. -
బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్
-
వెయ్యి మందికి చీరల పంపిణీ
చిత్తూరు, విజయపురం: నియోజకవర్గ కేంద్రమైన నగరి పట్టణంలో నిర్వహిస్తున్న గంగ జాతరలో భాగంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం వెయ్యి మందికి చీరలు పంపిణీ చేశారు. స్థానిక పెరుమాళ్ గుడి నుంచి వెయ్యి మందితో ఎమ్మెల్యే ఊరేగింపుగా వచ్చారు. ఏటాలాగే దేశమ్మ, ఓరుగుంటాలమ్మకు చీరలు అందించి మొక్కులు తీర్చుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి చీరలు ఇస్తున్నట్లు రోజా పేర్కొన్నారు. పట్టణ ప్రజలను గంగమ్మ చల్లగా చూడాలని..జగనన్న సీఎం కావాలని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. -
నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
-
బీజేపీ కార్యకర్తల సంబరాలు
రంగారెడ్డి : నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వానికి సంవత్సర కాలం పూర్తైన సందర్భంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ చెరువుకట్ట ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేద మహిళలకు బద్దం బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.


