కల్తీకల్లు దొరక్క మహిళ మృతి | Woman killed by adulterated liquor | Sakshi
Sakshi News home page

కల్తీకల్లు దొరక్క మహిళ మృతి

Nov 23 2015 5:43 PM | Updated on Mar 28 2018 11:11 AM

కల్తీ కల్లు దొరక్క రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ లో ఓ మహిళ మృతి చెందింది.

కల్తీ కల్లు దొరక్క ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలంలోని నవల్‌గాం పంచాయతి పరిధిలోని సౌర్య నాయక్ తండాలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తామీబాయి(36) గత కొన్నేళ్లుగా కల్లుకు బానిసైంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కల్తీ కల్లు దొరకక పోవడంతో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ సోమవారం సాయంత్రం మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement