ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్న ప్రమాదంలో యువతి మృతి చెందింది.
రంగారెడ్డి : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్న ప్రమాదంలో యువతి మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి స్టేజీ సమీపంలో మంగళవారం జరిగింది. బైక్ పై వెళ్తున్న యువతి(23), యువకులను(25) ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతికి తీవ్రగాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. మృతురాలిది రాంజేంద్రనగర్‌గా భావిస్తున్నారు.