ఆటో బోల్తా : మహిళ మృతి | Woman dies as Auto overturns | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : మహిళ మృతి

Nov 8 2015 11:49 AM | Updated on Aug 25 2018 5:39 PM

వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా.. మరో ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి.

ఇంద్రవెల్లి (ఆదిలాబాద్) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా.. మరో ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం రాంపూర్ గ్రామ శివారులో ఆదివారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన పత్తికూలీలు ఆటోలో వెళ్తున్న సమయంలో మూల మలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న జానకాబాయి(45) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement