సెల్ చార్జింగ్ పెడుతూ మహిళ మృతి | woman died | Sakshi
Sakshi News home page

సెల్ చార్జింగ్ పెడుతూ మహిళ మృతి

Feb 17 2015 2:44 PM | Updated on Sep 28 2018 3:39 PM

సెల్ చార్జింగ్ పెడుతూ విద్యుత్‌షాక్‌కు గురైన ఓ మహిళ మృతి చెందింది.

నల్లగొండ(తిరుమలగిరి): సెల్ చార్జింగ్ పెడుతూ విద్యుత్‌షాక్‌కు గురైన  ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మంగళవారం ఉదయం నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో విషాదం నింపింది.

 

బి. సోమనర్సమ్మ(55) ఉదయాన్నే సెల్‌కు చార్జింగ్ పెడుతుండగా షాక్‌కు గురైంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement