భర్త మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్య | woman committed suicide | Sakshi
Sakshi News home page

భర్త మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్య

Mar 20 2015 9:23 PM | Updated on Sep 2 2017 11:09 PM

భర్త మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్య

భర్త మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్య

భర్త చనిపోవడంతో మానసికంగా కుంగిపోయిన భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ : భర్త చనిపోవడంతో మానసికంగా కుంగిపోయిన భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్ లోని ఎల్‌బీనగర్ ఆర్టీసీకాలనీలో నివాసముండే ఏర్పుల శోభారాణి(32)  భర్త  కొన్నేళ్ల క్రితం టీబీ వ్యాధితో మృతిచెందాడు. అప్పటినుంచి ఆమె మానసికంగ కుంగిపోయింది. భర్త చనిపోయిన తర్వాత శోభారాణి.. కూతురు పావని (9), అత్తామామలతో కలిసి ఉంటోంది. కాగా మూడు రోజుల నుండి  శోభారాణి ఇంట్లో లేకపోవడంతో బంధవుల ఇంటికి వెళ్లినట్లు కుటుంబసభ్యులు భావించారు.

అయితే శుక్రవారం పైఅంతస్తులో ఉన్న పూజ గదిని శుభ్రం చేసేందుకు పైకి వెళ్లగా శోభారాణి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.  దుర్వాసన ఎక్కువగా వస్తుండటంతో మూడు రోజుల క్రితమే శోభారాణి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. దీనిపై సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement