లైంగిక వేధింపులు: యువకులకు దేహశుద్ధి | woman beats youth for sexual harassment | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులు: యువకులకు దేహశుద్ధి

Oct 13 2015 2:57 PM | Updated on Jul 23 2018 9:13 PM

మద్యం మత్తులో లైంగిక వేధింపులకు దిగిన ఇద్దరు యువకులకు ఓ మహిళా తైక్వాండో కోచ్ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది.

నాగోలు (హైదరాబాద్) : మద్యం మత్తులో లైంగిక వేధింపులకు దిగిన ఇద్దరు యువకులకు ఓ మహిళా తైక్వాండో కోచ్ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోలు ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగింది. తైక్వాండో కోచ్‌గా పనిచేసే నవనీత నివాసం ముందు పవన్, రామకృష్ణ అనే ఇద్దరు యువకులు కూర్చుని మద్యం సేవిస్తున్నారు.

వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని నవనీత హెచ్చరించింది. దీంతో ఆ ఇద్దరు యువకులు నవనీత చేయి పట్టుకుని లాగి వేధింపులకు దిగారు. ఇక లాభం లేదనుకున్న ఆమె వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. పోలీసులు వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement