హరితహారంతో భావితరానికి మేలు జరగాలి | With the benefit of posterity should haritaharam | Sakshi
Sakshi News home page

హరితహారంతో భావితరానికి మేలు జరగాలి

Jul 5 2015 1:20 AM | Updated on Aug 9 2018 4:45 PM

హరితహారంతో భావితరానికి మేలు జరగాలి - Sakshi

హరితహారంతో భావితరానికి మేలు జరగాలి

భావితరానికి ఉపయోగపడేలా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షులు, ...

వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కొత్తగూడెం అర్బన్: భావితరానికి ఉపయోగపడేలా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం కారుకొండ గ్రామపంచాయతీ హేమచంద్రాపురంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్క నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమాన్ని చేపట్టిందని అభినందించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా సంరక్షణ కూడా చూడాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధ తీసుకోవాలన్నారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొదమసింహ పాండురంగచార్యులు, రాష్ట్ర సెక్రెటరీ జెవీఎస్.చౌదరి, యువజన విభాగం సంయుక్త కార్యదర్శి భీమా శ్రీధర్, జిల్లా ప్రచార కార్యదర్శి పులి రాబర్ట్ రామస్వామి, మండలాధ్యక్షులు కందుల సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ కేస్లీ, ఎంపీటీసీలు బొల్లం రమేష్, తాటి పద్మ, శైలజ, కవిత తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement