కాంగ్రెస్‌కు ఎందుకు ఓటెయ్యాలి... | Why Should Vote For Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ఎందుకు ఓటెయ్యాలి...

Nov 28 2018 4:24 PM | Updated on Mar 18 2019 9:02 PM

Why Should Vote For Congress - Sakshi

మాట్లాడుతున్న రసమయి బాలకిషన్‌ 

సాక్షి, అల్గునూర్‌:  ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎందుకు ఓటెయ్యాలో ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని..టీఆర్‌ఎస్‌ మానకొండూర్‌ నియోజకవర్గ అభ్యర్థి రసమయి బాలకిషన్‌ డిమాండ్‌ చేశారు. తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీ, ఇందిరానగర్, కొత్తపల్లి, గొల్లపల్లి, నుస్తులాపూర్, నేదునూర్, లక్ష్మీదేవిపల్లి, వచ్చునూర్, జూగుండ్ల, రామ్‌హనుమాన్‌నగర్‌ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. తెలంగాణకు ద్రోహం చేసిన టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలన్నారు. మూడు నెలల్లో గౌరవెల్లి రిజర్వాయర్‌కు నీరందిస్తామన్నారు. 

తిమ్మాపూర్‌ మండలం రైతులకు గోదావరి నీరు అందిస్తామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా కరెంటు ఇస్తామని..సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు డబ్బులు కూడా ఇస్తామని వెల్లడించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మరోసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయితేనే బంగారు తెలంగాణ సంకల్పం నెరవేరుతోందని తెలిపారు. కారుగుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement