ఈటల నియామకాన్ని వ్యతిరేకించొద్దు | we would never oppossed etela appointment | Sakshi
Sakshi News home page

ఈటల నియామకాన్ని వ్యతిరేకించొద్దు

Apr 4 2015 1:30 AM | Updated on Sep 2 2017 11:48 PM

అంబేద్కర్, జగ్జీవన్‌రాం జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌గా మంత్రి ఈటల రాజేందర్‌ను నియమిస్తే తప్పేమిటని వివిధ బీసీ సంఘాలు ప్రశ్నించాయి.

ఎస్సీ, ఎస్టీ, బీసీల ఐక్యత ముఖ్యం: బీసీ సంఘాల నేతలు
 
 సాక్షి, హైదరాబాద్: అంబేద్కర్, జగ్జీవన్‌రాం జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌గా మంత్రి ఈటల రాజేందర్‌ను నియమిస్తే తప్పేమిటని వివిధ బీసీ సంఘాలు ప్రశ్నించాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీల ఐక్యతను కోరుకునే వారు దీనిని వ్యతిరేకించవద్దని జాజుల శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ (బీసీ సంక్షేమ సంఘం),ఎస్.దుర్గయ్య (బీసీ ఫెడరేషన్), శారదగౌడ్ (బీసీ మహిళా సంఘం) విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈటలను నియమించినా ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాజ్యాధికారం కోసం కలిసికట్టుగా పోరాడటంలో ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దళిత సంఘాలు  విశాలంగా ఆలోచించి మహనీయుల జీవితాలను వారి ఆదర్శాలు, ఆలోచనలను భవిష్యత్‌తరాలకు అందించే బాధ్యతను గుర్తించాలని, వివాదానికి ముగింపు పలకాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement