
సీఎం మేనమామను అభ్యర్థించిన కాంగ్రెస్ కార్యకర్తలు
సాక్షి, కామారెడ్డి: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామ ఆర్గొండ కమలాకర్‌రావును ఓటు అభ్యర్థించారు కాంగ్రెస్ కార్యకర్తలు. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని దేవి విహార్‌లో కమలాకర్‌రావు నివసిస్తుంటారు. ఆదివారం దేవునిపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు నీలం వెంకటి, సుధాకర్, నాగరాజు, మునీర్, ఆరిఫ్, నౌసిన్ తదితరులు ఆయన ఇంటికి వెళ్లారు.
కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీకి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీకి గతంలో కేసీఆర్ మేనమామ కమలాకర్‌రావుతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిన కరపత్రాన్ని చూసి, వారితో మాట్లాడి పంపించారు.