'విష్ణు, వంశీల గొడవ పార్టీకి సంబంధం లేదు' | Vishnuvardhan reddy meets ponnala | Sakshi
Sakshi News home page

'విష్ణు, వంశీల గొడవ పార్టీకి సంబంధం లేదు'

Dec 17 2014 7:39 PM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ యువ నాయకులు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిల మధ్య జరిగిన గొడవ పార్టీకి సంబంధం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

హైదరాబాద్: కాంగ్రెస్ యువ నాయకులు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిల మధ్య జరిగిన గొడవ పార్టీకి సంబంధం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గొడవ జరిగిన రోజు ఇద్దరితో మాట్లాడానని పొన్నాల చెప్పారు. ఇటీవల హైదరాబాద్లో ఓ పెళ్లి సందర్బంగా విష్ణు, వంశీ గొడవ పడి పరస్పరం ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే.

బుధవారం విష్ణు గాంధీభవన్లో పొన్నాలను కలిశారు. గొడవ విషయం ప్రస్తావనకు రాలేదని పొన్నాల, విష్ణు చెప్పారు.  తమ గొడవకు పార్టీకి సంబంధం లేదని విష్ణు చెప్పారు. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించేందుకు పొన్నాలను కలిసినట్టు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement