ఖమ్మం లోక్‌సభ నుంచి విజయశాంతి..! | Vijayashanti May Contest From Khammam Lok Sabha | Sakshi
Sakshi News home page

ఖమ్మం లోక్‌సభ నుంచి విజయశాంతి..!

Feb 6 2019 2:05 PM | Updated on Mar 18 2019 9:02 PM

Vijayashanti May Contest From Khammam Lok Sabha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం పార్లమెంట్‌ స్థానం నుంచి విజయశాంతి పోటీ చేస్తే స్వాగతిస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి మానవతారాయ్‌ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ నటిగా, తెలంగాణ ఉద్యమకారిణిగా ఆమెకు గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. ఖమ్మం నుంచి చాలాసార్లు వలస నేతలే విజయం సాధించారని ఆయన గుర్తుచేశారు. రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం కోసం, విజయశాంతి గెలుపు కోసం తాను కృషిచేస్తానని పేర్కొన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి స్థానం నుంచి పోటీచేయ్యాలని మానవతారాయ్‌ ప్రయత్నించారు. వరంగల్‌ లోక్‌సభ స్థానాన్ని తనకు కేటాయించాలని రాహుల్‌ గాంధీని కోరాతానని ఆయన తెలిపారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరిస్తున్న విజయశాంతి గతంలో మెదక్‌ లోక్‌సభ నుంచి ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement