రైస్‌ మిల్లులపై విజిలెన్స్‌​ దాడులు.. | vigilance officers attacked rice mills in nizamabad | Sakshi
Sakshi News home page

 రైస్‌ మిల్లులపై విజిలెన్స్‌ ​దాడులు..

Dec 30 2017 10:20 AM | Updated on Oct 17 2018 6:06 PM

సాక్షి, నిజామాబాద్‌: జిల్లాలోని కోటగిరి మండల కేంద్రంలోని  రెండు రైస్‌ మిల్లులపై విజిలెన్స్‌ అధికారులు దాడులు జరిపారు. మిల్లులో అక్రమంగా నిల్వ ఉన్న 10, 630 క్వింటాళ్ల ధాన్యంను సీజ్‌ చేశారు. ఒకే అనుమతితోనే రెండు రైస్‌ మిల్లులు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.

రైతుల నుంచి భారీ మొత్తంలో ధాన్యం సేకరించి ఎఫ్‌సీఐకి(ప్రభుత్వానికి) తరలించకుండా అమ్ముకున్నట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేసిన అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement