వలిగొండ ఏటీఎంలో చోరీ యత్నం | valigonda atm theft attempt | Sakshi
Sakshi News home page

వలిగొండ ఏటీఎంలో చోరీ యత్నం

Mar 14 2015 1:01 PM | Updated on Oct 16 2018 8:46 PM

నల్లగొండ జిల్లా వలిగొండలోని ఏటీఎం లో దొంగలు చోరీకి ప్రయత్నించారు.

నల్లగొండ : నల్లగొండ జిల్లా వలిగొండలోని ఏటీఎం లో దొంగలు చోరీకి ప్రయత్నించారు. ఈ సంఘటన శనివారం తెల్లవారజామున జరిగింది. వివరాలు..ఇండి క్యాష్ ఏటీఎంలో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరికి యత్నించారు. ఈ క్రమంలో వారు గ్యాస్ కట్టర్లు ఉపయోగించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాలకు టేప్ వేసి ఉంచారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ఆధారాల కోసం వెతుకు తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
(వలిగొండ)

Advertisement
 
Advertisement
Advertisement