breaking news
Indi Cash ATM
-
ఏటీఎం వద్ద రూ.10వేలు లభ్యం
సీసీ పుటేజీలో పరిశీలించి అందజేస్తానన్న యువకుడు షాబాద్: ఓ బ్యాంక్ ఏటీఎం వద్ద రూ.10వేలు దొరికాయి. సర్దార్నగర్లో ఇండిక్యాష్ ఏటీఎం ఉంది. బుధవారం ఉదయం 10గంటలకు అందులో డబ్బులు డ్రా చేసేందుకు కుర్వగూడకు చెందిన దాదె హరీశ్ ఏటీఎం కేంద్రానికి వెళ్లారు. ఏటీఎం కార్డును మిషన్ లో పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా డబ్బులు కనిపించాయి. వెంటనే తీసి చూశాడు. నాలుగు రూ.2వేల నోట్లు, 20 రూ.100 నోట్లు లభించాయి. అంతకుముందు వచ్చిన వారు డబ్బులు రావడం లేదని వెళ్లిపోయి ఉండొచ్చని అనుమానంతో డబ్బులు తీసుకుని చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వడంతో కొంతమంది మావేనని అక్కడికి రావడంతో ఇండిక్యాష్ సిబ్బందిని పిలిపించి సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా గుర్తించి అందజేస్తానని హరీశ్ తెలిపారు. -
వలిగొండ ఏటీఎంలో చోరీ యత్నం
నల్లగొండ : నల్లగొండ జిల్లా వలిగొండలోని ఏటీఎం లో దొంగలు చోరీకి ప్రయత్నించారు. ఈ సంఘటన శనివారం తెల్లవారజామున జరిగింది. వివరాలు..ఇండి క్యాష్ ఏటీఎంలో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరికి యత్నించారు. ఈ క్రమంలో వారు గ్యాస్ కట్టర్లు ఉపయోగించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాలకు టేప్ వేసి ఉంచారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ఆధారాల కోసం వెతుకు తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. (వలిగొండ)