ఏటీఎం వద్ద రూ.10వేలు లభ్యం | 10 thousand Detected at atm | Sakshi
Sakshi News home page

ఏటీఎం వద్ద రూ.10వేలు లభ్యం

Mar 3 2017 12:36 AM | Updated on Mar 28 2018 11:26 AM

ఏటీఎం వద్ద రూ.10వేలు లభ్యం - Sakshi

ఏటీఎం వద్ద రూ.10వేలు లభ్యం

ఓ బ్యాంక్‌ ఏటీఎం వద్ద రూ.10వేలు దొరికాయి. సర్దార్‌నగర్లో ఇండిక్యాష్‌ ఏటీఎం ఉంది.

సీసీ పుటేజీలో పరిశీలించి అందజేస్తానన్న యువకుడు
షాబాద్‌: ఓ బ్యాంక్‌ ఏటీఎం వద్ద రూ.10వేలు దొరికాయి. సర్దార్‌నగర్లో ఇండిక్యాష్‌ ఏటీఎం ఉంది. బుధవారం ఉదయం 10గంటలకు అందులో డబ్బులు డ్రా చేసేందుకు కుర్వగూడకు చెందిన దాదె హరీశ్‌ ఏటీఎం కేంద్రానికి వెళ్లారు.

ఏటీఎం కార్డును మిషన్ లో పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా డబ్బులు కనిపించాయి. వెంటనే తీసి చూశాడు. నాలుగు రూ.2వేల నోట్లు, 20 రూ.100 నోట్లు లభించాయి.  అంతకుముందు వచ్చిన వారు డబ్బులు రావడం లేదని వెళ్లిపోయి ఉండొచ్చని అనుమానంతో డబ్బులు తీసుకుని చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వడంతో కొంతమంది మావేనని అక్కడికి రావడంతో ఇండిక్యాష్‌ సిబ్బందిని పిలిపించి సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా గుర్తించి అందజేస్తానని హరీశ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement