breaking news
Rs 10 thousand
-
ఎర్రచందనం కేసులో జైలు శిక్ష
రైల్వేకోడూరు: ఎర్రచందనం అక్రమ రవాణా కేసుకు సంబంధించి తుపాకుల సిద్దయ్య అనే వ్యక్తికి ఏడాది జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధించినట్లు సబ్ డీఎఫ్ఓ వెంకటేష్, కోడూరు ఎఫ్ఆర్ఓ నయీం అలీ తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ 2012 సంవత్సరంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన మండలంలోని కన్నెగుంట ఎస్టీ కాలనీకి చెందిన సిద్దయ్యకు ఈమేరకు శిక్ష విధించారన్నారు. -
ఏటీఎం వద్ద రూ.10వేలు లభ్యం
సీసీ పుటేజీలో పరిశీలించి అందజేస్తానన్న యువకుడు షాబాద్: ఓ బ్యాంక్ ఏటీఎం వద్ద రూ.10వేలు దొరికాయి. సర్దార్నగర్లో ఇండిక్యాష్ ఏటీఎం ఉంది. బుధవారం ఉదయం 10గంటలకు అందులో డబ్బులు డ్రా చేసేందుకు కుర్వగూడకు చెందిన దాదె హరీశ్ ఏటీఎం కేంద్రానికి వెళ్లారు. ఏటీఎం కార్డును మిషన్ లో పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా డబ్బులు కనిపించాయి. వెంటనే తీసి చూశాడు. నాలుగు రూ.2వేల నోట్లు, 20 రూ.100 నోట్లు లభించాయి. అంతకుముందు వచ్చిన వారు డబ్బులు రావడం లేదని వెళ్లిపోయి ఉండొచ్చని అనుమానంతో డబ్బులు తీసుకుని చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వడంతో కొంతమంది మావేనని అక్కడికి రావడంతో ఇండిక్యాష్ సిబ్బందిని పిలిపించి సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా గుర్తించి అందజేస్తానని హరీశ్ తెలిపారు. -
రూ.10 వేలు ఇస్తాం.. కాలేజీకి రానక్కర్లేదు!
సాక్షి, హైదరాబాద్: ‘ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరాలనుకుంటున్నారా.. అయితే వెబ్ ఆప్షన్లలో మా కాలేజీని ఎంచుకోండి.. మీరు కాలేజీకి రావాల్సిన అవసరం లేదు.. మేమే మీకు రూ.10 వేలు ఇస్తాం’ అంటూ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ప్రలోభ పెడుతున్నాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్ల్దిండ్రుల ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్లు పంపిస్తున్నాయి. ప్రధాన కాలేజీలు తప్ప చిన్న చిన్న కాలేజీలు మా కాలేజీలో చేరండంటే.. మా కాలేజీలో చేరండి అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. కన్వీనర్ కోటాలో చేరితే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది కాబట్టి అందులో నుంచి కొంత మొత్తం ఇస్తామని విద్యార్థులకు ఎర వేస్తున్నాయి. పైగా కాలేజీకి రానవసరం లేదని అటెండెన్స్, మార్కులు తామే వేస్తామంటూ ప్రలోభ పెడుతున్నాయి. ఈ విషయం కాస్తా ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి దృష్టికి వెళ్లింది. అంతేకాదు ఆయన ఓ కాలేజీ యాజమాన్యానికి పేరెంట్లాగా ఫోన్ చేసి అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. ‘ఇదేమీ టెక్నికల్ కోర్సు కాదు కదా.. కాలేజీకి రానవసరం లేదు. మా కాలేజీలో చేర్చితే రూ.10 వేలిస్తాం’ అని యాజమాన్యం చెప్పడంతో పాపిరెడ్డి అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో కాలేజీల్లో విద్యార్థుల హాజరు విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంతోపాటు యాజమాన్యాల తప్పిదాలకు ఎలా చెక్ పెట్టాలన్న అంశంపై దృష్టి పెట్టాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న దాదాపు 250 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 28,228 సీట్లు అందుబాటులో ఉండగా, ఎంసీఏ కాలేజీల్లో 2,181 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి.