'రెండు రాష్ట్రాల్లో రెండు గద్దలు తిరుగుతున్నాయి' | Two eagles romaing in two states, says gutta sukender reddy | Sakshi
Sakshi News home page

'రెండు రాష్ట్రాల్లో రెండు గద్దలు తిరుగుతున్నాయి'

Jun 3 2015 9:47 PM | Updated on Sep 3 2017 3:10 AM

'రెండు రాష్ట్రాల్లో రెండు గద్దలు తిరుగుతున్నాయి'

'రెండు రాష్ట్రాల్లో రెండు గద్దలు తిరుగుతున్నాయి'

తెలుగు రాష్ట్రాల్లో రెండు గద్దలు తిరుగుతున్నాయని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

మిర్యాలగూడ(నల్లగొండ) : తెలుగు రాష్ట్రాల్లో రెండు గద్దలు తిరుగుతున్నాయని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో కలసి విలేకరుతో మాట్లాడారు. ముఖ్యమంత్రులిద్దరూ అప్రజాస్వామికంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11మంది ఎమ్మెల్యేలను ప్రోత్సహించి టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారన్నారు.

అదే విధంగా ఏపీలో చంద్రబాబు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని టీడీపీలో చేర్చుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రాతినిధ్యం కోసం చంద్రబాబు పాకులాడుతున్నాడని విమర్శించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూస్తే అనైతిక రాజకీయాలు, అప్రజాస్వామిక పాలన బట్టబయలైందన్నారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నాడని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement