గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరి మృతి | two dies in un identified vehichle hitting | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరి మృతి

May 3 2015 3:27 PM | Updated on Aug 25 2018 6:06 PM

గుర్తుతెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

న్యాన్‌కల్ (మెదక్ జిల్లా): గుర్తుతెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా న్యాన్‌కల్ మండలం మామిడి గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. బీదర్‌కు చెందిన నగేష్(35). సూర్య(26) ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుకనుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆపకుండా వెళ్లిపోయింది.

విషయం తెలిసిన వెంటనే న్యాన్‌కల్ సబ్‌ఇన్‌స్పెక్టర్ లవ్ కుమార్ సంఘనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఢీకొట్టి వెళ్లిపోయిన వాహనాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement