వడదెబ్బతో ఇద్దరి మృతి | Two died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఇద్దరి మృతి

Mar 20 2016 8:20 PM | Updated on Sep 3 2017 8:12 PM

వరంగల్ జిల్లాలో వడదెబ్బతో ఆదివారం ఇద్దరు మృతిచెందారు.

 భానుడి ప్రతాపం నానాటికీ పెరుగుతోంది. వరంగల్ జిల్లాలో వడదెబ్బతో ఆదివారం ఇద్దరు మృతిచెందారు. ఖానాపురం వుండలం రాగంపేటకు చెందిన మొగిళి సత్యం(86) సుమారు 20 కిలోమీటర్ల దూరంలో గల వుండలంలోని చిలుకవ్మునగర్‌లోని తవు బంధువుల ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రవుంలో వడదెబ్బకు గురై చిలుకవ్మునగర్ సమీపంలో రోడ్డు పక్కనే మృతి చెందాడు.

మరో ఘటనలో వరంగల్ నగరంలోని కరీమాబాద్ తొట్లవాడకు చెందిన పాకాల సారంగపాణి(58) మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చే శాడు. ఆ తర్వాత కాసేపటికే కళ్లుతిరిగి పడిపోయాడు. కుటుంబసభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement